ఇది విన్నారా.. భారీ వ‌ర్షాల‌కు క‌రోనా కూడా కార‌ణ‌మేన‌ట‌!

క‌రోనా వైర‌స్.ప్ర‌పంచ‌దేశాల్లో ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే ప్ర‌జ‌ల‌ను వెంటాడుతోంది.

గ‌త ఏడాది ఎక్క‌డో చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పురుడు పోసుకున్న క‌రోనా అంత‌కంత‌కూ విజృంభించి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతోంది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు.

ప‌ద‌కొండు ల‌క్ష‌ల‌కు పైగా మంది క‌రోనా కాటుకు బ‌లైపోయారు.ఈ మాయ‌‌దారి క‌రోనాను క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.

ప్ర‌భుత్వాలు వైర‌స్‌ను ఎలా క‌ట్ట‌డి చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నాయి.అయితే క‌రోనా నుంచి కోలుకున్న వారు మూడు కోట్లు దాట‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశంగా చెప్పుకొచ్చు.

ఇక ఈ క‌రోనాతోనే వ‌ణికిపోతుంటే.మ‌రోవైపు భారీ వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తున్నాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కార‌ణంగా నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ వ‌ర్షాల దెబ్బ‌కు ఆస్తి న‌ష్టంతో పాటు ఎంతో ప్రాణ న‌ష్టం కూడా జ‌రిగింది.

అయితే భారీ వ‌ర్షాల‌కు క‌రోనా కూడా కార‌ణ‌మ‌ని అంటున్నారు నిపుణులు.అదెలాగో కూడా విశ్లేషించారు.

క‌రోనా కార‌ణంగా స‌మ్మ‌ర్ మొత్తం అంటే మార్చ్ చివ‌రి నుంచి జూలై వరకూ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ అమలైన విష‌యం తెలిసిందే.

ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.దీంతో దేశంలో కాలుష్యం కనిష్ఠానికి ప‌డిపోయింది.

ఫ‌లితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి.తేమ శాతం పెరిగిందని నిపుణులు వివ‌రించారు.

ఇక వాతావ‌ర‌ణంలో ఏర్ప‌డిన ఈ అనూహ్య మార్పులే మ‌రిన్ని వ‌ర్షాల‌ను ప్రోత్సహించిందని చెప్పుకొచ్చారు.

దీనికి తోడు వ‌రుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో.నైరుతీ రుతుపవనాలు వెనక్కు మళ్లడం ఆలస్యమైందని తెలిపారు.

ఈ కారణంతోనే భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.మొత్తానికి క‌రోనా కూడా భారీ వ‌ర్షాల‌కు ఒక కార‌ణ‌మ‌ని తేలింది.

వార్ 2 తో సక్సెస్ కొట్టకపోతే ఎన్టీయార్ బాలీవుడ్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే..?