యూకే: కరోనా నుంచి కోలుకున్న భారత సంతతి ఎంపీ, ఇంటి నుంచే పని

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు.

ఇప్పటికే బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్, ప్రిన్స్ ఛార్లెస్, కెనడా ప్రధాని భార్యకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

అలాగే స్పెయిన్ యువరాణి ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో భారత సంతతి ఎంపీ వీరేంద్ర శర్మకు కొద్దిరోజుల క్రితం కోవిడ్ 19 సోకగా, ఆయన మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా వీరేంద్ర మాట్లాడుతూ.కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని కోరారు.

ముఖ్యంగా ప్రస్తుత పరిస్ధితుల్లో సామాజిక దూరాన్ని మించిన మందు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

72 ఏళ్ల వీరేంద్ర శర్మ పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ సౌత్‌హాల్‌ నుంచి లేబర్ పార్టీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

"""/"/ ఈ నెల ఆరంభంలో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు.

అయితే కోవిడ్ 19 ప్రధాన లక్షణాలలో ఒకటైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో శర్మ ఆరోగ్యం క్షీణించింది.

దీంతో ఆయన స్థానిక హిల్లింగ్‌డన్ ఆసుపత్రిలో చేరి సుమారు వారం రోజులు చికిత్స తీసుకున్నారు.

ప్రభుత్వం, నేషనల్ హెల్త్ సర్వీస్ సూచనల మేరకు తాను కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇంటికే పరిమితమవుతున్నానని వీరేంద్ర శర్మ తెలిపారు.

ఈ సందర్భంగా తీవ్ర ఒత్తిడిలోనూ కష్టపడి పనిచేసి తనకు అద్భుతమైన సేవలు అందించిన వైద్య సిబ్బందికి ఎంపీ కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా కరోనా వైరస్ కారణంగా యూకేలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య రెండు వేలు దాటింది.

సోదరి పెళ్లిలో డ్యాన్స్ తో ఫిదా చేసిన సాయిపల్లవి.. ఈ బ్యూటీ డ్యాన్స్ సూపర్ అంటూ?