మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం?

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్త గత కొన్నేళ్లుగా వినబడుతోంది.

అప్పుడు ఆ విషయాన్ని కేటీఆర్ పలు ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది.

అయితే మరోసారి రాజకీయ వర్గాలలో ఇటీవల కేసీఆర్ కు తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తుండడంతో సీఎం పీఠాన్ని కేటీఆర్ కు అప్పజెప్పాలని కేసీఆర్ బలంగా నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యూహంలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, ఐటీ శాఖ మంత్రి పదవి ఇలా అన్ని ముఖ్యమైన బాధ్యతలు ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండే బాధ్యతలు.

కావున వీటన్నింటిలోకేటీఆర్ మార్క్ నిరూపించుకున్నాడు కాబట్టి సీఎం స్థాయి పదవిని కేటీఆర్ సమర్థవంతంగా నడపగలడని గట్టి నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచారానికి బలం చేకూరేటట్టు కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు స్వంత పార్టీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిస్తే.

ఏది ఏమైనా జాతకాలను, పంచాంగాన్ని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చిలో ఉగాది సందర్భంగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్22, శుక్రవారం 2024