ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఈ
వైరస్ బారిన పడ్డవారికి వైద్యులు నిత్యం వైద్యసేవలు అందిస్తున్నారు.కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలకుండా సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులకు ప్రపంచవ్యాప్తంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వారి సేవలను కీర్తిస్తూ గుండు గీసుకున్నాడు.
తానే సొంతంగా గుండు గీసుకుంటూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రపంచంలోని ఇతర క్రీడాకారులు కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరాడు.కరోనా వైరస్ కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజా సేవలో ఉన్న వారందరికీ తాను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా వార్నర్ తెలిపాడు.
కాగా వార్నర్ గుండు చేసుకుని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు మరో ఏడుగురికి ఈ ఛాలెంజ్ విసిరాడు.
అయితే కోహ్లీ ఎప్పుడు తన హెయిర్ కట్‌ను చాలా స్టైలిష్‌గా ఉండేలా చూసుకుంటాడు.
మరి వార్నర్ విసిరిన ఛాలెంజ్‌కు ఆయన ఒప్పుకుంటాడా లేడా అనేది సందేహంగా మారిందని క్రీడాభిమానులు అంటున్నారు.