విడ్డూరం : బ్రహ్మంగారు అయ్యగారిపైకి వచ్చి కరోనా మందు చెప్పాడట.. బ్రహ్మంగారి మఠం వారు ఏమన్నారంటే

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ సమయంలో ఫేక్‌ న్యూస్‌ దావానంలా వాప్తి చెందుతున్నాయి.

జనాలు లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు.దాంతో ఎవరికి తోచినట్లుగా వారు ఫేక్‌ వార్తలు క్రియేట్‌ చేస్తున్నారు.

ఎవడో ఒక్కడు ఫేక్‌ న్యూస్‌ క్రియేట్‌ చేస్తే అది కాస్త దావానంలో లక్షల మందికి సోషల్‌ మీడియాలో కొన్ని గంటల వ్యవధిలోనే వ్యాప్తి చెందుతుంది.

దాంతో ఏ వార్త నిజం ఏ వార్త అబద్దం అనే విషయాన్ని కూడా జనాలు తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల క్రితం ఒక పుకారు రాకెట్‌ కంటే స్పీడ్‌గా వ్యాప్తి చెందింది.

గత కొన్ని రోజులుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించిన వార్తలు మీడియాలో ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి.

ఇలాంటి సమయంలో బ్రహ్మంగారికి సంబంధించిందే మరో వార్త ప్రచారం జరగడంతో అంతా కూడా నిజమే అనుకున్నారు.

ఇంతకు ఆ వార్త ఏంటీ అంటే కడప జిల్లాలోని బ్రహ్మంగారి మంఠంకు చెందిన ఒక అయ్యగారి ఒంటి మీదకు బ్రహ్మంగారు వచ్చారు.

కరోనా వైరస్‌ నుండి బయట పడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మిరియాలు, అల్లం, బెల్లం కలిపిన నీటిని తాగాలంటూ చెప్పాడు.

అది చెప్పిన వెంటనే ఆ వ్యక్తి చనిపోయాడట. """/"/మఠంకు చెందిన ఆ అయ్యగారి మృత దేహంకు అంత్యక్రియలు అయ్యేలోపు ప్రతి ఒక్కరు కూడా ఆ మిశ్రమాన్ని తాగాలంటూ ప్రచారం మొదలైంది.

దాంతో రాత్రికి రాత్రి కొన్ని లక్షల మంది ఆ మిశ్రమంను తాగారు.తీరా మీడియా వారు రెవిన్యూ సిబ్బంది అక్కడకు వెళ్లగా అసలు అలాంటిది ఏమీ జరగలేదు అంటూ మఠం అధికారులు ఇంకా పూజారులు చెప్పుకొచ్చారు.

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠంకు చెందిన ఏ ఒక్క అయ్యగారు కాని మరెవ్వరు కాని మృతి చెందలేదు.

అవన్ని పుకార్లే అంటూ స్వయంగా మఠంకు చెందిన వారు మీడియా ముందుకు వచ్చి చెప్పారు.

సోషల్‌ మీడియాలో వచ్చేవి అన్ని కూడా పుకార్లే అంటూ పోలీసులు చెబుతున్నా కూడా జనాలు మాత్రం పిచ్చిగా నమ్మి పాటిస్తున్నారు.

ఇకపై అయినా వచ్చే వార్తలను ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

యూకేలో పెరిగిన అంత్యక్రియల ఖర్చులు.. ఎందుకో తెలిస్తే..