ఎంత చెప్పినా అర్ధం కావడంలేదా ? ఎవరూ పట్టించుకోరేం ?

ఏదైతే చేయకూడదని గట్టిగా హెచ్చరించి మరీ చెబుతారో అవి మాత్రమే ఎక్కువ చేస్తుంటారు జనాలు.

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా బూచితో అల్లాడుతోంది.ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ మినహా మరో మార్గం ఏమి కనిపించకపోవడంతో అన్ని దేశాలు ఇవే పటిస్థిస్తున్నాయి.

లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే అన్నట్టుగా గప్ చిప్ అయిపోయారు.

అన్ని మార్గాలు మూసుకుపోయాయి.యావత్ ప్రపంచం ఎప్పుడూ పడనంత ఇబ్బంది ఇప్పుడు పడుతోంది.

మిగతా దేశాలతో పోల్చి చూస్తే పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా కనిపిస్తున్నా, రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.

అసలు భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం వెనుక కారణాలు ఏంటి అనేది ఆరాతీస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

"""/"/అసలు కరోనా వైరస్ భారత్ లో మొదటి దశలో ఉండగానే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు భద్రతాపరమైన చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసినా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగానే తయారయ్యింది.

ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుందని ఎంత చెప్పినా ప్రజలు మాత్రం ఆ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకుండా పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తినట్టుగా కనిపిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఒక్క గొంతుకగా రానున్న ప్రమాదాన్ని గుర్తించి హెచ్చరించారు.

లాక్ డౌన్ ఎందుకు పెట్టాల్సివచ్చిందో నెత్తి నోరు బాదుకుని మొత్తుకుని చెప్పినా జనాల్లో మాత్రం ఆ స్థాయిలో భయం కానీ, ఆందోళన కానీ కనిపించడంలేదు.

ప్రజలంతా సహకరిస్తే సమాజం మొత్తం ముప్పు నుంచి బయటపడుతుందని చెప్పినా జనాల్లో మాత్రం ఆ స్థాయిలో భయం ఇప్పటికీ కనిపించడంలేదు.

కొంతమంది లాక్ డౌన్ ను సమర్థవంతంగానే పాటిస్తున్నా, చాలామంది జనాల్లో మాత్రం అదే రకమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి రేపు అనేది ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి జనాలంతా ముందు జాగ్రత్త పేరుతో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి ఇబ్బడి ముబ్బడిగా సరుకులు కొనుగోలు చేస్తున్నారు.

తెల్లారుతూనే వీధుల్లోకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు.కిరాణా దుకాణాలు, ఇటు రైతు బజార్లలో జనంతో జాతరనే తలపిస్తోంది.

తెల్లారిలేస్తే పొయ్యిలో పిల్లిని లేపాలంటే బజారున పడాల్సిందే.ఇలా వచ్చే వారందరికీ కరోనా వైరస్ భయం ఉంది.

అయినా కడుపు నింపుకునేందుకు గుంపులు గుంపులుగా వీధుల్లోకి వస్తున్నారు.ఇందులో జనాలను తప్పుపట్టేందుకు ఏమీ లేకపోయినా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన బాధ్యత వారిపై ఉంది.

లండన్‌లోని భారత హైకమీషన్‌పై దాడి కేసు .. ఇందర్‌పాల్ ప్రమేయం నిజమే, ఎన్ఐఏ ఛార్జ్‌షీట్