మీకు తెలుసా : మీకు పావలా బిల్లంత మచ్చ తొడకు కాని చేతికి కాని ఉందా అయితే మీకోసమే ఈ న్యూస్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో ఇండియన్స్‌ ఏదో ఒక ఆశతో ఏదో ఒక నమ్మకంతో మాకు ఏం కాదులే అనే దృడ విశ్వాసంతో కరోనాతో పోరాడుతున్నారు.

ఈ సమయంలో ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియన్స్‌ విపత్తును ఎలా ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడమే కాకుండా తమను తాము సాంత్వన పర్చుకోవడం కోసం ఎవరికి వారు మనసు నిమ్మలపర్చుకోవడం కోసం ఏదో ఒక సాకును వెదుక్కుంటున్నారు.

"""/"/ఈ సమయంలో సోషల్‌ మీడియాలో మరో ప్రచారం మొదలైంది.ఎవరి చేతికి లేదా తొడకు చిన్నప్పుడు బీసీజీ టీకా వేశారో వారు ఇప్పుడు కరోనాను జయిస్తున్నారట.

బీసీజీ టీకా వేసినట్లుగా చేయి లేదా తొడ మీద పావల బిల్ల అంత ఉండే ఒక గుర్తు కనిపిస్తుంది.

అది ఒక తెల్ల మచ్చగా ఉంటుంది.పెద్ద వారికి అది ఎక్కువగా ఉంటుంది.

కొందరికి రెండు మూడు కూడా ఉంటాయి.ఇప్పుడు వారు అదృష్టవంతులు అని వారికి కరోనా సోకదని, ఒకవేళ కరోనా వచ్చినా కూడా వారికి ఎలాంటి ప్రాణ హాని ఉండదు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ విషయాన్ని వైధ్యులు అయితే నిర్థారించలేదు కాని కొందరు బీసీజీ టీకా గురించి అధ్యయనం చేశాము చాలా మంచిగా పని చేస్తుంది, ఇప్పుడు దానికి కరోనాను అడ్డుకట్ట వేయగల సత్తా ఉందని అంటున్నారు.

ఇప్పుడు విచారించాల్సిన విషయం ఏంటీ అంటే ఈమద్య కాలంలో ఈ టీకాలు వేయడం మానేశారు.

పెద్ద వయసు వారిలో మాత్రమే ఇప్పుడు ఈ గుర్తులు కనిపిస్తాయి.ఒకవేళ ఇదే నిజం అయితే చాలా మంది మళ్లీ టెన్షన్‌లో ఉన్నట్లే కదా.

ఇలాంటి నమ్మకాలు పెట్టుకోకుండా అందరు జాగ్రత్తగా ఉండాలని మాత్రం డాక్టర్లు ఇంకా ప్రభుత్వ అధికారులు మరీ మరీ చెబుతున్నారు.

ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట