కరోనా నెగటివ్ వచ్చింది.. రూ.3 లక్షలు బిల్లు!
TeluguStop.com
కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కరోనా వచ్చి ప్రాణాలు తియ్యడం కంటే కష్టమైనది ఏంటంటే ఆస్పత్రి బిల్లు కట్టడం.
సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది కరోనా చికిత్స బిల్లు.ఓ న్యాయవాదికి కరోనా వైరస్ లేకపోయినా ఓ ప్రైవేటు ఆస్పత్రి 4 రోజులు చికిత్స చేసి ఏకంగా మూడు లక్షల రూపాయిలు బిల్లు వేసింది.
ఇంకా ఈ విషయం తెలుసుకున్న ఆ న్యాయవాది పోలీసులను ఆశ్రయించాడు.ఇంకా ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
నగరంలో విజయ్ నగర్ కాలనీకి చెందిన శ్రీధర్ సింగ్ అనే న్యాయవాదికి జూలై 28న స్వల్పంగా జ్వరం, తలనొప్పి రావడంతో ఆయన సోమాజీగూడలోని డెక్కన్ ఆస్పత్రికి వెళ్లారు.
కరోనా అని అనుమానించిన వైద్యులు ఆయనకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించి ఆయన ఆధార్‌కార్డు తీసుకున్నారు.
కరోనా నిర్దారణ మెసేజ్ వచ్చేకి అయన ఫోన్ నెంబరు కాకుండా తమ ఉద్యోగి నెంబర్ పెట్టి శ్రీధర్‌ను కరోనా భాదితులు ఉండే వార్డులో ఉంచారు.
కరోనా ఫలితం నెగటివ్ అని వచ్చిన ఆ విషయాన్నీ శ్రీధర్ కు చెప్పకుండా కరోనా చికిత్స చేశారు.
అయితే కరోనా పరీక్షా ఫలితంపై శ్రీధర ఆస్పత్రి నిర్వాహకులను గట్టిగా నిలదీయగా రిపోర్టును అందజేశారు.
అందులో నెగటివ్ అని ఉండడంతో తనకు కరోనా చికిత్స ఎందుకు చేస్తున్నారు అని అతన్ని ప్రశ్నించినప్పటికి ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోలేదు.
దీంతో అతను ఏప్రిల్ 1వ తేదీన డిశ్చార్జ్ అవ్వగా అతనికి మూడు లక్షల బిల్లు వేశారు.
ఏప్రిల్ 2వ తేదీ పూర్తిగా కడితే తప్ప అతన్ని బయటకు పంపలేదు.ఇంటికి వచ్చిన అనంతరం ఆ న్యాయవాది పంజాగుట్ట పోలీసులకు ఆస్పత్రిపై ఫిర్యాదు చెయ్యగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఏది ఏమైనా కరోనా ను వైద్యులు ఏ రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారు అన్న దానికి ఇదే నిదర్శనం.
పుష్ప 2 బాహుబలి దంగల్ రికార్డ్ ను బ్రేక్ చేయాలంటే ఇంకా ఎంత కలెక్షన్స్ ను రాబట్టాలి…