వాక్సిన్ రెడీనా ? ట్రయిల్స్ పూర్తయ్యాయా ?

కరోనా వైరస్ ప్రభావంతో అల్లాడుతున్న ప్రపంచ దేశాలు ఈ పీడ ఎప్పుడు విరగడ అవుతుందో తెలియక సతమతం అవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ వైరస్ ప్రభావానికి గురయ్యి అల్లాడుతున్నాయి.ఆర్ధికంగా తీరని నష్టం ఏర్పడడంతో పాటు పౌరుల ప్రాణాలకు ముప్పు ఏర్పడడంతో ప్రపంచ దేశాలన్నీ అంతలాకుతలం అయిపోతున్నాయి.

మొన్నటి వరకు బద్ద శత్రువులుగా ఉన్న దేశాలన్నీ ఇప్పడు కరోనా కారణంగా ఏకమయ్యాయి.

అంతే కాదు ఈ మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళిని రక్షించుకునేందుకు అన్ని దేశాలు కలిసి ఈ వైరస్ నిరోధానికి అనేక రక్షణ చర్యలు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ వైరస్ ప్రభావానికి ఇప్పటికే చాలా దేశాలు అల్లాడిపోతున్నాయి.

కోలుకొని విధంగా నష్టపోయాయి. """/"/ఇక భారత దేశంలో కాస్త పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా కనిపిస్తున్నా, అమెరికా, బ్రిటన్, ఇటలీ వంటి దేశాల్లో పరిస్థితి బాగా అదుపు తప్పింది.

మరి కొద్ది రోజుల్లో మరింత తీవ్రతరం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ వైరస్ కి విరుగుడు మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చైనా లో పుట్టిన ఈ వైరస్ కి చైనానే మందును కనిపెట్టి ప్రపంచ దేశాలకు ఇవ్వాలని చూస్తోంది.

` కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్దం చేస్తున్న వ్యాక్సిన్‌కు విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ఆ దేశంలోని వుహన్ నగరంలో ఈ వ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహిస్తుండగా, అవి పూర్తిగా సురక్షితం, విజయవంతం అయినట్టుగా తేలితే ఇకపై విదేశాల్లో ట్రయిల్స్ నిర్వహించాలని చైనా పరిశోధకులు భావిస్తున్నారు.

అక్కడి ప్రభుత్వం అనుమతితో ఈ వ్యాక్సిన్‌కు తొలిదశ ట్రయిల్స్ ను వుహన్ లో మార్చి 16న మొదలుపెట్టారు.

దీనికి సంబందించిన ఫలితాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని చైనీస్ అకాడమీ అఫ్ ఇంజనీరింగ్ సభ్యుడు చెన్ వీ చెబుతున్నారు .

అంతే కాకుండా చైనాలో ఉన్న విదేశీయులపైనా ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తామంటూ ఆయన తెలిపారు.

సీమతో పాటు ఆ జిల్లాల ప్రజలే వైసీపీని గెలిపించనున్నారా.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుందా?