ఆ రెండింటి ద్వారా కరోనా సోకదు.. !
TeluguStop.com
కరోనా వైరస్ ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ వణికించేస్తోంది.
నాలుగు రోజుల క్రితం రష్యా వ్యాక్సిన్ విడుదల అయినా సంగతి తెలిసిందే.అయితే ప్రజలంత కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బయటకు వెళ్లి వచ్చిన వెంటనే స్నానం చెయ్యడం శానిటైజ్ చెయ్యడం చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కొందరు తినే తిండిపైన కరోనా వ్యాపిస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంటే డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది.
ఆహారం ద్వారా కరోనా వైరస్ వ్యాపించదని.అలా వ్యాపించే అవకాశమే లేదని ప్రకటించింది.
అంతేకాదు.ఆహారం ద్వారా కానీ, ప్యాకేజింగ్ ద్వారా కానీ కరోనా వైరస్ సోకినట్టు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అని తెలిపారు.
ఆహార పదార్ధాలను కొనుగోలు చేస్తే భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేందుకు భయం అవసరం లేదని వారి తెలిపారు.
దీనికి సంబంధించిన పరిశోధన ఒకటి చైనా చేసిందని, అందులోని ఫలితాలు ఆధారంగానే ఈ ప్రకటన చేసినట్టు సమాచారం.
జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?