కరోనా సోకితే కళ్లకు అంత ప్రమాదమా..?
TeluguStop.com
ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.ప్రజల ఆరోగ్యంపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
శాస్త్రవేత్తలు వైరస్ గురించి లోతుగా అధ్యయనం చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా వైద్యుల పరిశోధనల్లో కరోనా సోకితే కళ్లకు ప్రమాదమని తేలింది.ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులు కరోనా నుంచి కోలుకున్న వారిలో కంటి సమస్యలు కనిపిస్తున్నాయని వెల్లడించారు.
కొందరు రోగుల్లో కంటిచూపు మందగిస్తోంటే మరి కొందరు రోగుల్లో రెటీనా సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు.
వైరస్ నుంచి కోలుకున్న రెండు నుంచి నాలుగు వారాల తర్వాత ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.
రెటినోపతి అనే సమస్య చాలామందిలో కనిపిస్తోందని ఈ సమస్య ఉన్నవారిలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకుండా దృష్టి సంబంధిత సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
వైద్యులు కరోనా చికిత్స కోసం స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారని చికిత్స కోసం వినియోగించే స్టెరాయిడ్లు కంటిచూపు మసకబారడంతో పాటు ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వారిలో కంటి సంబంధిత సమస్యలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
సరైన సమయంలో చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
కొందరు కరోనా రోగుల్లో స్టెరాయిడ్లు వినియోగించకపోయినా వాపు సమస్య కనిపిస్తోందని.2 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని అలా చేస్తే ప్రమాదమని సూచిస్తున్నారు.
మరోవైపు దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.శాస్త్రవేత్తలు దేశంలో కరోనా సెప్టెంబర్ నెలలో పీక్ స్టేజ్ కు చేరిందని ప్రస్తుతం క్రమంగా పడుతోందని చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండటం గమనార్హం.
వారిద్దరూ కేబినెట్‌లో వద్దు .. డొనాల్డ్ ట్రంప్‌కు భారత సంతతి నేత హెచ్చరిక