భారత్ లో కరోనా టీకా ట్రయల్స్ నిలిపివేత..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.

మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.

ఈ వైరస్ ని నివారించడానికి దేశంలో కరోనా టీకా ట్రయల్స్‌ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే దేశంలో కరోనా టీకా ట్రయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిపివేసిందని సమాచారం.

అయితే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అందించిన నివేదిక ప్రకారం.కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ ను నిలిపివేసినట్లు తెలిపారు.

ఈ వ్యాక్సిన్ ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేశారు.ఈ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ టీకాను ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ లో 2, 3 దశలపై క్లినికల్ ట్రయల్స్ చేశారు.

అయితే ఈ వ్యాక్సిన్ ని బ్రిటన్ ‌లో జరిపిన మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ లో ఈ టీకా ఇచ్చిన వ్యక్తి అనారోగ్యానికి గురైయ్యాడు.

దింతో వ్యాక్సిన్ వికటించడంతో ఈ ట్రయల్స్‌ను నిలిపివేసినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది.ఇక చెడు ప్రభావాలను అరికట్టేందుకు స్వతంత్ర కమిటీ సమీక్ష కోసంఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

తాజాగా వెలువడిన పరిణామాల నేపథ్యంలో ఇండియాలో చెప్పటిన క్లినికల్ ట్రయల్స్ గురించి వివరణ ఇవ్వాలంటూ ఎస్ఐఐని డీసీజీఐ తెలిపింది.

అయితే భారత్ లో ఇప్పటివరకు చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి చెడు ఫలితాలు రాలేదని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం