భారత్‎లో కరోనా కల్లోలం..! రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మళ్లీ విజృంభణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే విదేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

చైనాలో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండగా కొరియా, జపాన్, అమెరికాలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇటు భారత్‎లోనూ కరోనా కల్లోలం చెలరేగుతోంది.దీంతో అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఈ మేరకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం తెలిపింది.

మరోవైపు కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ సమీక్ష నిర్వహించారు.

ఎయిడ్స్‌పై పరిశోధనలు .. భారత సంతతి దంపతులకు ప్రతిష్టాత్మక పురస్కారం