ఆందోళన కలిగిస్తున్న కరోనా ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్.. హెచ్చరిస్తున్న నిపుణులు.. !
TeluguStop.com
గత సంవత్సరం ఇండియాలో ప్రవేశించిన కోవిడ్ ఇప్పటి వరకు తన జైత్రయాత్రను విజయవంతంగా కొనసాగిస్తుంది.
ముఖ్యంగా ప్రజల జీవితాలను మార్చేది రాజకీయ నేతలే అన్న అపోహను తొలగించి తాను కూడా వారికంటే వేగంగా, దారుణంగా ప్రజల జీవితాలను కాలరాస్తానని నిరూపించింది కరోనా వైరస్.
ఇక ఉన్న వాడు కరోనా రావద్దని దేవుణ్ని వేడుకుంటుంటే, పేదలు మాత్రం లాక్‌డౌన్ రాకుండా, ఆకలి చావులు పెరగకుండా చూడు దేవుడా అని ప్రార్దించే స్దాయికి దిగజార్చింది ఈ మహమ్మారి.
ఇకపోతే కరోనా మొదలైంది సింగిల్ గానే కానీ ఈ మధ్యలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ లెటెస్ట్ వెర్షన్‌తో ముప్పతిప్పలు పెడుతుంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెబుతున్నారు నిపుణులు.
అదేమంటే.దేశంలో మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది.
ఈ ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ కు చెందిన బీ.1.
617 రకం స్ట్రెయిన్‌ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నిపుణులు తెలిపారు.
దీని వల్ల దేశంలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదమున్నదని, ముఖ్యంగా బెంగాల్ హాట్‌స్పాట్‌గా మారనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీడియో వైరల్: వీధుల్లో ప్రజలను బయపెట్టాలనుకున్న మహిళా.. చివరికి?