పలుకుబడి ఉన్న వారికే పరీక్షలు.. సామాన్య ప్రజల గగ్గోలు.. ఇదే తెలంగాణ సిత్రం..?

కరోనా వైరస్ కష్ట కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అపవాదు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

అదేంటంటే రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు సరిగా జరగడం లేదని.

అటు పలువురు జనాలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు.స్వయంగా ప్రజలే కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేసుకునేందుకు వస్తే.

ఏదో ఒక సమాధానం చెప్పి వెనక్కి పంపి చేస్తున్నారు అనే వాదన ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రతిరోజు కనీసం రెండు వేల మందికి పైగా ఇలా కరోనా వైరస్ టెస్టుల కోసం వస్తే వారికి సరైన పరీక్షలు నిర్వహించడం లేదు అన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తున్న వాదన.

అయితే ఇదే సమయంలో పలుకుబడి ఉన్న వారికి మాత్రం అడిగిందే తడవుగా కరోనా వైరస్ నిర్దారిత పరీక్షలు చేస్తున్నారు అని ఆరోపణలు కూడా తెర మీదకు వస్తున్నాయి.

పలుకుబడి ఉన్న వారికి పరీక్షలు నిర్వహించడంలో చూపించినంత శ్రద్ధ సామాన్య ప్రజల విషయంలో కుసుమంతైన లేదు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అదే సమయంలో ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు.

ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతిస్తే అధిక ఫీజులు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారు అని అంటుంది తెలంగాణ ప్రభుత్వం.

దీంతో కరోనా వైరస్ కష్టకాలంలో కూడా పలుకుబడి ఉన్న వాళ్ళే రాజ్యం గా మారిపోయింది.

ఇక ప్రభుత్వాసుపత్రుల్లో సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించకపోవటంతో తమకు కరోనా వైరస్ ఉందా లేదా అని ఎటూ తేల్చుకోలేక నరకం అనుభవిస్తున్నారు సామాన్య ప్రజలు.

ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తే బాగుంటుంది అని ప్రజల నుంచి బలంగా వాదనలు వినిపిస్తున్నాయి.

మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

జబర్దస్త్ లో రెమ్యూనరేషన్ తక్కువే.. కోట్లలో ఆస్తులు అదిరే అభి కామెంట్స్ వైరల్!