ఆచార్యని టెన్షన్ పెడుతున్న కరోనా సెకండ్ వేవ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా నటిస్తుంది.పూజా హెగ్డే రామ్ చరణ్ తో రొమాన్స్ చేయబోతుంది.

ఇక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోదేవాలయాల పరిరక్షణ కాన్సెప్ట్ తో ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

ధర్మస్థలి అనే టెంపుల్ సెట్ లో మెజారిటీ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది.

రీసెంట్ గా చిత్ర యూనిట్ ఓ సాంగ్ కూడా రిలీజ్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో కూడా మెగాస్టార్ స్టెప్పులు వేసినట్లు ఆ పాటని చూస్తే తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతుంది.

ఈ సినిమాలో ఓ పీరియడ్ పార్ట్ కొరకు హై-ఎండ్ విఎఫ్ఎక్స్ అవసరం పడనుంది.

అయితే ఈ విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలంటే కచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా చాలా టైం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఆచార్య సినిమాను మే 13న విడుదల చేయనునట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఈ నేపధ్యంలో అనుకున్న డేట్ ని రిలీజ్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది.

అయితే కొరటాల ఇప్పటికే ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేస్తూ మరో వైపు షూటింగ్ కూడా కొనసాగిస్తున్నాడు.

అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు రావడానికి భయపడుతున్నాడు.

అయితే ఆచార్య మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి రిలీజ్ తర్వాత ప్రేక్షకుల రాకపై టెన్షన్ లేకపోయిన మరో నెల రోజులలో సినిమా రిలీజ్ ఎలా అనేది ఇప్పుడు ఆచార్య టీమ్ ముందు ఉన్న పెద్ద సవాలుగా కనిపిస్తుంది.

గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!