జూన్‌, జులై సినిమాలపై కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం పడనుందా?

కరోనా దెబ్బకు గత ఏడాది మార్చి నుండి డిసెంబర్ వరకు సినిమా ల విడుదల పూర్తిగా ఆగిపోయింది.

థియేటర్లకు డిసెంబర్‌ నుండి అనుమతులు వచ్చినా ఎక్కువ శాతం జనవరి నుండి విడుదల మొదలు అయ్యింది.

జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెల సినిమాలు విడుదల అయ్యాయో లేదో అప్పుడే థియేటర్ల వద్ద కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా సందడి ఆగిపోయింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో విడుదల అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడుతున్నాయి.

చిన్నా చితకా సినిమాలు వస్తే వస్తాయేమో కాని పెద్ద సినిమాలు మాత్రం రావడం లేదు.

ఈ రెండు నెలలు థియేటర్లను మూసి వేయడం బెటర్ అనే ఉద్దేశ్యంతో కూడా సురేష్‌ బాబు మరియు దిల్‌ రాజు వంటి నిర్మాతలు ఉన్నారు.

వారు ఇప్పటికే అనధికారికంగా థియేటర్ల మూసి వేత పై ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్‌ నాలుగు నుండి ఆరు వారాల వరకు ఉంటుందని అంటున్నారు.

కనుక మే నెల వరకు ఈ వేవ్‌ ప్రభావం ఉండవచ్చు.అయితే జూన్‌ జులై నెలల్లో సినిమా లు యధావిధిగా వస్తాయా అంటే అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా పోయిందనే భావన వచ్చేందుకు కనీసం రెండు మూడు నెలల సమయం అయినా పడుతుంది.

కనుక కరోనా సెకండ్‌ వేవ్‌ నుండి బయట పడాలంటే ఆగస్టు సెప్టెంబర్ వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌ అక్టోబర్‌ లో కేసులు చాలా తగ్గాయి.అయినా డిసెంబర్‌ జనవరి వరకు జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించారు.

కనుక ఇప్పుడు కూడా ఈ ఏడాది ఆగస్టు వరకు సినిమాల విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

జులై నెలలో థియేటర్ల లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ చేసేందుకు యాజమాన్యాలు ముందుకు వస్తాయని అంటున్నారు.

కనుక జూన్‌ జులై లో విడుదల కావాలనుకున్న సినిమాలు కూడా విడుదల కష్టమే అంటున్నారు.

వాల్‌మార్ట్‌లోని వస్తువులు నేలపై పడేస్తూ రచ్చ చేసిన బాలిక.. వీడియో చూస్తే షాకే..