పంజాబ్ కేబినెట్ మంత్రికి కరోనా పాజిటివ్
TeluguStop.com
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజురోజుకు కరోనా కేసులు వేలల్లో నమోదవుతూనే ఉన్నాయి.
ఇప్పటివరకు దేశంలో 30 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులను కరోనా వెంటాడుతోంది.ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
కొందరు క్యూర్ అయి విధులు కూడా నిర్వర్తిస్తున్నారు.అయితే తాజాగా పంజాబ్ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రాంధావాకు కరోనా పాజిటివ్ వచ్చిందని పంజాబ్ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తన ట్వీటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.‘‘ నా కేబినెట్ సహచరుడు, రాష్ట్ర జైలు శాఖ మంత్రి సుఖ్జిందర్ రాంధావాకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాడు.
పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆయన త్వరగా కోలుకుని అందరితో కలిసి పని చేయాలని కోరుతున్నాను.
’’ అంటూ ట్వీటర్ లో వెల్లడించారు.ఇప్పటి వరకు పంజాబ్ క్యాబినెట్ మంత్రుల్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.
మంత్రులు రాజిందర్ సింగ్ బజ్వా, గురు ప్రీత్ సింగ్ కాంగర్ లు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
ఈ రెండు కలిపి జుట్టుకు రాస్తే హెయిర్ ఫాల్ పరార్..!