జార్ఖండ్ వ్యవసాయశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.రాష్ట్రాల్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

రోజురోజుకు కరోనా దడ పుట్టిస్తోంది.కేసులు వేలల్లో నమోదవుతూనే ఉన్నాయి.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా వెంటాడుతోంది.ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డరు.

కొందరు హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.మరి కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యం చేయించుకుంటున్నారు.

కరోనా బారిన పడి క్యూర్ అయి విధుల్లోకి చేరిన వారు ఉన్నారు.అయితే తాజాగా జార్ఖంగ్ వ్యవసాయ శాఖ మంత్రి బాదల్ పత్రలేఖ్ కు కరోనా పాటిజిట్ గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్వీటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.ట్వీటర్ లో ఆయన మాట్లాడుతూ.

‘‘ గత కొద్ది రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను.శనివారం రాత్రి వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది.

ఈ మేరుకు హోం క్వారంటైన్ లో ఉండి కరోనా చికిత్స పొందుతున్నాను.నాతో పాటు ఉన్న సన్నిహితులు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోండి.

’’ అంటూ ట్వీట్ చేశారు.

గేమ్‌ ఛేంజర్‌ ‘దోప్‌’ సాంగ్‌ విడుదల.. డాన్సుతో మెస్మరైజ్ చేసిన గ్లోబల్ స్టార్