క్వారంటైన్ సెంటర్ లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న కరోనా పేషెంట్స్ …!

భారతదేశంలో రోజురోజుకి కరోనా వైరస్ ఎంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇందులో భాగంగా ఎవరికైనా కరోనా వచ్చిన, కరోనా అనుమానిత వ్యక్తులందరిని క్వారంటైన్ సెంటర్లో ఉంచి వారికి చికిత్స చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఎవరైనా సరే ఒకసారి క్వారంటైన్ సెంటర్ లోకి వెళితే కనీసం 14 రోజుల వరకు వారు ఉండి చికిత్స తీసుకొని రెండు సార్లు నెగిటివ్ అని వచ్చిన తర్వాతే ఆ సెంటర్ లో నుంచి బయటికి రావడానికి అనుమతి ఉంటుంది.

ఇకపోతే అన్ని ప్రాంతాల్లో లాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా క్వారంటైన్ కేంద్రాన్ని నడుపుతుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

అయితే క్వారంటైన్ సెంటర్లో రోజు ఖాళీగా ఉండి ఉండాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా.

అందులోనూ అందరూ కరోనా వైరస్ సోకితులు అయిన వాళ్లే.అయితే కరోనాపేషెంట్లు క్వారంటైన్ సెంటర్లో వెసులుబాటు కొరకు తమకు తోచినట్లుగా టైం పాస్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో.

దీనికి సంబంధించిన ఈ వీడియోను నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.క్వారంటైన్ సెంటర్లో వారి ప్రతిభకు మెరుగు పెడుతున్నారు.

ఇకపోతే తాజాగా టైం టైంపాస్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది.

అది ఎందుకు అలా జరుగుతుందంటే జమ్మూకాశ్మీర్లోని ఓ క్వారంటైన్ సెంటర్లో రోగులు అందరూ చక్కగా క్రికెట్ ఆడుతున్నారు.

ఇకపోతే ఈ క్రికెట్ ఆడుతున్న వీడియో కాస్త జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

అందుకు గాను " స్థలం ఉంది ఆడుకొని.క్వారంటైన్ టైం పాస్ అని" క్యాప్షన్ ఇస్తూ పేర్కొన్నారు.

ఇంకంతే వీడియో కేవలం గంటల వ్యవధిలోనే కొన్ని వేల వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ వీడియో చుసిన నెటిజన్లు కాస్త వెరైటీ గా " కేసులు పెరగడంలో ఆశ్చర్యమేమీ లేదు.

గడ్డు కాలంలో కూడా మన భారతీయులు వినోదం కొరకు ఏదో ఒక దాన్ని అన్వేషిస్తూనే ఉంటారు" క్వారంటైన్ అన్న పదానికి అర్థాన్ని మాత్రం మార్చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా నిజానికి అది క్వారంటైన్ కేంద్రమా లేకపోతే క్రికెట్ స్టేడియమా అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్..!!