కోవిడ్ పేషంట్‌ను క్రేన్‌తో లిఫ్ట్ చేసిన చైనీయులు.. వీడియో చూస్తే షాకే..!

చైనాలో నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కరోనా కాలంలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ దేశం అత్యంత కఠినాత్మకమైన రూల్స్ అమలు చేసింది.

కరోనా సోకిన వారి ఇళ్ల తలుపులను క్లోజ్ చేయడం, కొందరిని చిన్న బాక్సులలో పెట్టి నిర్బంధించడం వంటివి చైనా అధికారులు చేయడం మనం చూసాం.

కాగా ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో మళ్లీ కోవిడ్ వ్యాప్తి చెందుతోంది.దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలోనే చైనాలోని అధికారులు ఒక రోగి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు.

కరోనా సోకిన వ్యక్తిని క్రేన్ సహాయంతో పైకి లేపి వేరే చోటికి చేర్చారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోను అదే ప్రాంతానికి చెందిన స్థానికుడు ఓ కిటికీ నుంచి రికార్డ్ చేయగా.

అది కాస్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ వీడియోలో సామాజిక దూరాన్ని పాటించడం కోసం అధికారులు క్రేన్‌కు వేలాడుతున్న వ్యక్తిని జాగ్రత్తగా ఎత్తడం.

రవాణా చేయడం చూపిస్తుంది.ట్విట్టర్‌లో ఈ వీడియో లక్షలలో వ్యూస్, వేలలో లైక్స్‌ వైరల్‌గా మారింది.

ఇదెక్కడి తలతిక్క రూల్, అయ్యా బాబోయ్, జనాల్ని చంపేస్తారా ఏంటి అని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

"""/"/ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇప్పటికే తన జీరో కోవిడ్ విధానాన్ని ప్రకటించారు.

జీరో కోవిడ్ అంటే, కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు కనిపిస్తే నగరాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తారు.ముఖ్యమైన నగరాలు, ప్రాంతాలలో మొత్తం లాక్‌డౌన్‌లు ఆర్థిక ప్రభావాన్ని చూపడంతో ఈ విధానం ప్రపంచస్థాయిలో విమర్శలకు దారి తీసింది.

అలానే చైనా ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.

వుహాన్‌లో అక్టోబర్ 26 నుంచి అక్టోబరు 30 వరకు, జిల్లాలోని 800,000 మందికి పైగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు నోటీసులో తెలిపారు.

గొప్ప మనస్సు చాటుకున్న అక్కినేని ఫ్యామిలీ.. అండగా నిలుస్తూ ప్రశంసలు అందుకున్నారుగా!