ఐసోలేషన్ నుంచి తప్పించుకుని సూపర్ మార్కెట్‌కు.. భారతీయుడి చేష్టలపై విమర్శలు

కరోనా వైరస్ యమ డేంజర్ అన్న సంగతి తెలిసిందే.మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా.

ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు.అలాగే కోవిడ్ 19 వచ్చిన వారు సైతం తమ నుంచి పక్కవారికి వైరస్ వ్యాపించకుండా అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలి.

ఇది కనీస మానవత్వం.అయితే ఓ వ్యక్తి మాత్రం వైరస్ వచ్చిందన్న ఇంగీత జ్ఞానం లేకుండా ఐసోలేషన్ సెంటర్ నుంచి అదృశ్యమై షాపింగ్‌ మాల్‌కు వెళ్లాడు.

వివరాల్లోకి వెళితే.భారత్ నుంచి ఇటీవల న్యూజిలాండ్ వచ్చిన 32 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

దీంతో ఆయనను అధికారులు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.ఈ క్రమంలో అతనికి సూపర్ మార్కెట్‌కు వెళ్లాలనే బుద్ది పుట్టింది.

అనుకున్నదే తడవుగా మంగళవారం ఐసోలేషన్ కేంద్రం ఫెన్సింగ్‌ను దాటుకుని అదృశ్యమయ్యాడు.జూలై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో పాటు ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకటించింది.

"""/"/ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన కరోనా రోగి 20 నిమిషాలు గడిపాడని, అనంతరం 70 నిమిషాల తర్వాత తనంతట తానుగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రి క్రిస్ హిప్కిన్స్ వెల్లడించారు.

నిబంధనలు అతిక్రమించి ప్రజల ప్రాణాలకు హానీ కలిగించేలా ప్రవర్తించినందుకు భారతీయుడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా 4 వేల డాలర్లు ( భారత కరెన్సీలో 2.

8 లక్షల జరిమానా) విధించే అవకాశం వుందని న్యూజిలాండ్ హెరాల్డ్ తెలిపింది.మరోవైపు కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి తమ స్టోర్‌కు వచ్చాడని తెలుసుకున్న సదరు సూపర్ మార్కెట్ సిబ్బంది సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

వీరందరికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.కాగా న్యూజిలాండ్‌ కరోనాపై విజయం సాధించిన తొలి దేశంగా ఘనత సాధించింది.

ఇప్పటి వరకు అక్కడ 1187 కేసులు వెలుగు చూడగా, ప్రస్తుతం 23 యాక్టివ్ కేసులున్నాయి.

వార్ 2 తో సక్సెస్ కొట్టకపోతే ఎన్టీయార్ బాలీవుడ్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే..?