వామ్మో.. క‌రోనా కొత్త రూట్‌.. గేదెల‌కు సోకుతోంది..!

కరోనా కంగారు ఏదో ఒక రూపంలో ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది.ఇప్పటి దాకా కరోనా మహమ్మారి కేవలం గబ్బిలాలను తింటేనే వస్తోందని నమ్మేవారు.

కానీ ప్రస్తుతం ఈ మహమ్మారి గేదెల మాంసం తిన్నా.సోకుతుందని కంబోడియా ప్రభుత్వం తెలిపింది.

మరో ఆందోళనకర విషయం ఏంటంటే భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలోనే కరోనా వైరస్ మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం.

ఇన్ని రోజులు భారత్ లో కోవిడ్ ఎక్కువగా ఉందనే కారణంతో మన దేశం నుంచి దిగుమతులపై కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది.

కానీ ఇప్పుడు ప్రస్తుతం భారత్ లో పరిస్థితులు అదుపులోకి రావడంతో మరలా దిగుమతులను ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో మన దేశం నుంచి ఆ దేశానికి గేదె మాంసాన్ని ఎగుమతి చేశారు.

ఇందులో కరోనా మూలాలున్నట్లు గుర్తించామని కంబోడియా అధికారులు వెల్లడించారు.కానీ అక్కడ కు చేరుకున్న మాంసం కంటెయినర్లను కంబోడియా నిలిపేసింది.

ఇక్కడి నుంచి అక్కడకు పంపించిన గేదె మాంసంలో కరోనా మూలాలున్నట్లు గుర్తించామని అందుకే కంటెయినర్లను నిలిపివేసినట్లు ప్రకటించారు.

ఈ కంటెయినర్లను కంబోడియాకు ఓ ప్రైవేటు కంపెనీ సరఫరా చేసింది.ప్రస్తుతం కేవలం కంటెయినర్లను పక్కకు పెట్టామని అందులోని పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని కంబోడియా ప్రభుత్వం వెల్లడించింది.

"""/"/ కంబోడియా దేశంలో కూడా ప్రస్తుతం కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

మంగళవారం కొత్తగా ఆ దేశంలో మరో 685 మందికి కరోనా సోకగా.19 మంది కరోనాతో మృతి చెందాడు.

ప్రస్తుతం అక్కడ మొత్తం 74 వేల 386 కరోనా కేసులున్నాయని కంబోడియా అధికారులు ప్రకటించారు.

ఇప్పటివరకూ ఆ దేశంలో కరోనా సోకి మొత్తంగా 1, 324 మంది మరణించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

వ్యాక్సినేషన్ ప్రక్రియ కంబోడియాలో చాలా వేగంగా కొనసాగుతోంది.

పోస్ట్ స్టడీ వీసా రూట్‌ను కొనసాగించాల్సిందే .. యూకే ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక