తెలంగాణ‌లో క‌రోనా త‌గ్గుముఖం..!

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.గ‌డిచిన 24 గంటల్లో265 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, కొత్త‌గా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేద‌ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో హైద‌రాబాదులో అత్య‌ధికంగా 142 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 14 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 528 మంది కరోనా నుంచి కోలుకున్నార‌ని వెల్ల‌డించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 8,29,467 పాజిటివ్ కేసులు నమోదు కాగా.

8,22,173 మంది కోలుకున్నారు.ఇంకా 3,183 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృత్యువాత ప‌డ్డార‌ని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

భారతీయులకు గుడ్ న్యూస్.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని తెలుసా?