హ‌జ్ యాత్ర‌పై పడిన క‌రోనా ప్ర‌భావం.. రద్దుచేసిన ప్రభుత్వం.. !

దేశానికి దరిద్రంలా పట్టుకున్న కరోనా వైరస్ వల్ల జనానికి స్వేచ్చ లేకుండా పోయిందని అర్ధం అవుతుంది.

అంటరాని వారిగా ముసుగులు తొడుక్కుని భయం భయంగా బ్రతుకుతామని కలలో కూడా ఊహించి ఉండరు.

ఒకరకంగా మనుషులకంటే జంతువులు, పక్షులు నయం అనిపిస్తుంది ప్రస్తుత కాలంలో.ఇకపోతే కరోనా ఫస్ట్ వేవ్ వల్ల అన్ని యాత్రలు రద్దైన విషయం తెలిసిందే.

కోవిడ్ కొంత విరామం ఇవ్వగానే హమ్మయ్య వచ్చే సంవత్సరం అయినా స్వేచ్చగా ఆలయాలను సందర్శించ వచ్చని చాలా మంది ఆశించారు.

కనీ ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ ఈ సంవత్సరం ఆశపడిన వారిమీద నీళ్లు చల్లింది.

ఇక ముస్లిం సోదరులకు హ‌జ్ యాత్ర అంత పవిత్రమైన యాత్ర లేదు.ముస్లింల పుట్టిన ప్రతి వారు జీవితంలో ఒక్క‌సారైనా హ‌జ్ యాత్ర‌కు వెళ్లాల‌ని భావిస్తారు.

ఇంతటి పవిత్ర యాతను ఈ సంవత్సరం కూడా ర‌ద్దు చేసింది ఇండోనేషియా ప్రభుత్వం.

ఇక సౌదీ అరేబియా సైతం హజ్‌కు ప్రవేశం లేదని ప్రకటించింది.కాగా ఇప్ప‌టికే హ‌జ్ యాత్రకు ఫీజులు చెల్లించిన‌వారు వ‌చ్చే ఏడాది ప్రయాణం చేయవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

ఒక్క ఎపిసోడ్ కి 5 కోట్ల రెమ్యూనరేషన్.. కపిల్ శర్మ క్రేజ్ మామూలుగా లేదు?