మాజీ ప్రధాని కుటుంబానికి సోకిన కరోనా.. అతను ఎవరంటే.. ?
TeluguStop.com
విదేశీ బ్రాండ్ అయిన కరోనా ఏ దేశాన్ని వదలలేదన్న విషయం అందరికి తెలిసిందే.
అలాగే ప్రతి దేశంలో ఉన్న ముఖ్యమైన వారిని కూడా ఒక చూపు చూసి వెళ్లుతుంది.
ఇదిలా ఉండగా ఫస్ట్ వేవ్ కరోనా నుండి తప్పించుకున్న వారిని ఈ సెకండ్ వేవ్ స్వీటుగా పలకరిస్తుంది.
ఇందులో భాగంగా తాజాగా ఎందరో సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అందరు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన సతీమణి కి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యిందట.
ఈ విషయాన్ని స్వయంగా దేవగౌడ ట్వీట్ చేశారని సమాచారం.ఇకపోతే కోవిడ్ నిర్ధారణ కారణంగా తమ కుటుంబం అంతా హోం ఐసోలేషన్ లో ఉన్నామని, పూర్తిగా ఆరోగ్యకరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నామని కాబట్టి పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడ వద్దని అన్నారు.
ఇక తమను ఇటీవల కలిసిన వారంత కోవిడ్ టెస్ట్‌లు చేసుకోవాలని ఈ సందర్భంగా దేవగౌడ సూచించారు.
ఏపీలో తొలిసారిగా 600కు 600 మార్కులు.. నేహాంజని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!