తెలంగాణలో కరోనా @ 1.60,571

తెలంగాణలో కరోనా కేసులు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి.రోజూ రెండు వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.

వైరస్ ఒకరి నుంచి మరొకరికి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల 1,60,571కి చేరింది.నిన్న ఒక్కరోజే 2,180 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దీంతో వీరి సంఖ్య 1,29,187కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10 మంది మరణించగా.మరణించిన వారి సంఖ్య 984కి చేరింది.

అయితే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు 0.61 శాతంగా ఉందని, రికవరీ రేటు 80.

45 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.సోమవారం 51,247 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా 22,20,586 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.మరో 908 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

కొన్ని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 277, కరీంనగర్ 135, రంగారెడ్డి 143, మేడ్చల్ మల్కాజిగిరి 97, వరంగల్ అర్బన్ 108, సిద్ధిపేట 106 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఓరి దేవుడో.. ఇంత పెద్ద బీరువాను బైక్‌పై ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..