తిరుమలలో కరోనా, భక్తుల సంఖ్య ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కరోనా భయం లేదులే అని చాలా మంది అనుకున్నారు.కాని అనూహ్యంగా ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు కరోనా సోకిందని వెళ్లడి అయ్యింది.

అప్పటి నుండి కూడా తెలుగు రాష్ట్రాలు చిగురుటాకు మాదిరిగా వణికి పోతున్నాయి.ఇతర ప్రాంతాల నుండి ఎక్కువగా వచ్చే తిరుపతిలో కూడా కరోనా వైరస్‌ భయం వణికిస్తుంది.

రెగ్యులర్‌గా వచ్చే భక్తుల కంటే ప్రస్తుతం సగం మంది కూడా రావడం లేదు.

వీకెండ్స్‌ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో వచ్చే భక్తులు కనీసం వేలల్లో కూడా రాకపోవచ్చు అంటూ ఊహాగాణాలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో కొందరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా బాధితుడు సంచరించాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

దాంతో తిరుమల వెళ్లాలి అనుకున్న వారు కూడా తమ ప్రయాణంను రద్దు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ వ్యవహారం ఇలాగే సాగితే తిరుమల వెంకన్నకు కోట్లల్లో నష్టం అంటున్నారు.

గుంటూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!