దేశ ఆర్థిక రాజధానికి కోలుకోలేని దెబ్బ

కరోనా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత స్పీడ్‌గా విస్తరిస్తున్న విషయం గుర్తించిన భారత ప్రభుత్వం కేసులు పదుల సంఖ్యలో ఉండగానే లాక్‌డౌన్‌ విధించింది.

దాంతో కేసుల సంఖ్యను వేలకు వెళ్లకుండా చూడగలిగాం అనుకున్నాం.కాని మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కరోనా కేసుల సంఖ్య భయాందోళన కలిగిస్తుంది.అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.

లక్షలాది మంది నివాసం ఉండే దారావి మురికి వాడలో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఏకంగా 1233 కేసులు నమోదు అయినట్లుగా ఆరోగ్య శాఖ పేర్కొంది.

మహారాష్ట్రలో మొత్తంగా 16758 కేసులు నమోదు అయ్యాయి.అందులో ముంబయిలోనే 10527 కేసులు ఉన్నాయి.

నిన్న ముంబయిలో 769 కేసులు నమోదు అయ్యాయి.మొత్తం మహారాష్ట్రలో 651 మంది చనిపోగా కేవలం ముంబయిలో ఇప్పటి వరకు 412కు చేరాయి.

ఇక దారావి ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 733 కాగా ఇప్పటి వరకు అక్కడ 21 మంది చనిపోయినట్లుగా అదికారులు వెళ్లడి చేవారు.

దారావి ప్రాంతంలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

దారావి ప్రాంతంలో సామాజిక దూరం అనేది అసాధ్యం.కనుక అక్కడ పరిస్థితిని అదుపు చేసేందుకు ఏం చర్యలు చేయాలో తెలియని పరిస్థితి.

ఇంకా మూడు రోజులే ..  ఈ ముగ్గురూ బిజి బిజీ