గంగమ్మని శుద్ధి చేసిన కరోనా… ప్రకృతి చిత్రమంటే ఇదేనా

ప్రతి వందేళ్ళకి ఒకసారి ఒక వైరస్ ఈ ప్రపంచంలో మానవజాతి మీద దాడి చేస్తుందని చరిత్రలో ఆధారాల బట్టి తెలుస్తుంది.

ఈ వైరస్ ల కారణంగా కొన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు కోల్పోతున్నది ఎంత వరకు నిజమో ప్రకృతి ప్రతి వందేళ్ళకి ఒకసారి మలినమైన తన శరీరాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

ఈ ప్రయత్నంలో మానవ మనుగడని కొంత కాలం భయపెట్టి బయటకి రాకుండా చేస్తుంది అనేది కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కనిపిస్తున్న నిజం.

ప్రస్తుతం కరోనా మహమ్మారిగా మారి ప్రపంచం మొత్తం భయపెడుతుంది.దీనిని కంట్రోల్ చేయడానికి దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.

ఈ కారణంగా ఇంతకాలం మనం సృష్టించిన కాలుష్యం సుమారు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది.

వందేళ్ళలో మనం ప్రకృతిలో ఉండే అన్నింటిని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేసేశాం.

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు.కాలుష్యానికి కారణం అవుతున్న ఫ్యాక్టరీలు, వాహనాలు బంద్ అయిపోయాయి.

దీంతో ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు నదులలో కలవడం ఆగిపోయింది.అలాగే కాలుష్య వాయువు గాలిలో కలవడం ఆగిపోయింది.

ఈ కారణంగా నదులు వాటికవే శుద్ధి చేయబడ్డాయి.అలాగే గాలి కూడా దానికదే శుద్ధి అయ్యింది.

ముఖ్యంగా కాలుష్యంతో నిండివుండే పవిత్ర గంగానదిలోని నీరు తాగేంత స్వచ్ఛంగా మారడం విశేషం.

గంగానది ప్రక్షాళన చేయడానికి బీజేపీ ప్రభుత్వం వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యింది.

సేవ్ గంగా అంటూ పిలుపునిచ్చింది.నదుల సంరక్షణపై ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున అవగాహనా పెంచే ప్రయత్నం చేశారు.

అయితే వేటికి లొంగని మనిషిని కరోనా వైరస్ లొంగదీసుకుంది.ప్రజలందరిని భయపెడుతూ ప్రకృతిని శుద్ధి చేస్తుంది.

లాక్‌డౌన్‌ పుణ్యమా అని గంగా నది రూపు మారింది.హరిద్వార్, రిషికేశ్‌ లో ప్రవహించే నది నీరు గతంలో ఎన్నడూ లేనంతగా శుభ్రపడి తాగడానికి కూడా ఉపయోగపడేలా మారిందని ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది.

ఇలా దేశంలో అన్ని నదులు ప్రస్తుతం తాగడానికి ఉపయోగపడే స్థాయిలో శుద్ధి చేయబడ్డాయి.

దీని అంతటికి కారణం కరోనా అని చెప్పాల్సిందే.

వైసీపీ నాయకుల మాటలను ఎవరు నమ్మటం లేదంటూ దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు..!!