తెలంగాణలో కరోనా ఎఫెక్ట్.. మళ్లీ మూతపడనున్న పాఠశాలలు.. ?

ప్రజల నిర్లక్ష్యం అయితేనేమి, ప్రభుత్వం తీసుకునే చర్యల్లో అలసత్వం అయితేనేమి మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన ఖాతా తెరచింది.

విజయవంతంగా కోవిడ్ కేసుల సంఖ్యను తన అకౌంట్లో వేసుకుంటుంది.ఇప్పుడిప్పుడే ప్రజల జీవనం గాడిలో పడుతుందని, పిల్లలను స్కూళ్లకు పంపిస్తే వాళ్ల చదువు వారు చదువుకుంటారని భావించిన తల్లిదండ్రులకు ఈ కరోనా వల్ల పెద్ద తలనొప్పి వస్తుంది.

మళ్లీ స్కూళ్లను మూసివేసే పరిస్దితులు తలెత్తుతున్నాయి.ఇప్పటికే అధిక ఫీజులు వసూల్ చేస్తున్న స్కూళ్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకోని విద్యాశాఖ అధికారులు మాత్రం కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో స్కూళ్లను మూసివేయాలని నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే పలువురు స్కూల్ విద్యార్థులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.దీని పై సీరియస్‌గా దృష్టి పెట్టిన ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా 1-8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రానప్పటికి ప్రస్తుతం ప్రభుత్వం ముందు మరో ఆప్షన్ కూడా లేకపోవడం సృష్టంగా తెలుస్తుంది.

అందుకే సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఏది ఏమైన ఆలస్యం చేయకుండా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిదని విద్యార్ధుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారట.

ఓలా స్కూటర్‌ను ధ్వంసం చేసిన ఓనర్‌.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..