అమెరికాలో కరోనా ఎఫెక్ట్...భారత్ లో వాటికి భారీ డిమాండ్...!!

అమెరికాలో కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం అంతాయింతా కాదు.బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అన్నట్టుగానే అక్కడి ప్రజల ఆర్ధిక పరిస్థితులు ఒక్క సారిగా తల్లకిందులు అయ్యాయి.

దాంతో పలు సంస్థలు, వ్యాపారాలు మూతబడ్డాయి, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.

అయితే ధనవంతుల పరిస్థితులు మాత్రం ఎప్పటిలానే ఉన్నాయి.వారి అలవాట్లు, దైనందిక జీవితం మాత్రం కరోనా ముందు, కరోనా తరువాత ఒకేలా ఉన్నాయి.

ప్రపంచంలో కెల్లా బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇలాంటి వాటిపై ఎక్కువగా మక్కువ చూపేది భారతీయులే ఆ తరువాత ఈ మధ్య కాలంలో అమెరికన్స్ కు డైమండ్స్ మీద విపరీతమైన ఆశక్తి కలిగింది.

కరోనా తరువాత చైనా తో కలిగిన ఆర్ధిక పరమైన లావాదేవీల కారణంగా అమెరికా ఆంక్షలు విధించడంతో చైనాతో అప్పటి వరకూ కొనసాగిన బంగారం, డైమండ్స్ దిగుమతులు తగ్గడంతో అమెరికన్స్ చూపు భారత్ లోని గుజరాత్ వైపుకు మళ్ళింది.

దాంతో భారత్ నుంచీ వచ్చే డైమండ్స్ కు విపరీతమైన ఆదరణ పెరిగింది.గుజరాత్ నగరం భారత దేశంలో కెల్లా డైమండ్స్, బంగారం అధికంగా ఎగుమతి చేసే నగరం కావడంతో ఒక్క సారిగా అక్కడ డైమండ్స్ దుఖాణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయాయట.

గతంలో గుజరాత్ లో 250 -300 దుఖాణాలు ఉంటే అమెరికా నుంచీ వస్తున్నా ఆర్డర్ల కారణంగా ప్రస్తుతం గుజరాత్ లో దాదాపు 500 లకు పైగా దుఖాణాలు వెలిసాయని తెలుస్తోంది.

ప్రస్తుతానికి అమెరికా నుంచీ ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయని మరీ ముఖ్యంగా హిప్ హాప్ సంస్కృతిని అనుసరించే వారి నుంచీ అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని, వజ్రాలతో నిండిపోయే రోలెక్స్ వాచ్ లకు భారీ డిమాండ్ ఉందని వీటికి భారీగా ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు గుజరాత్ వాసులు.

ఒక్కో సారి ప్రత్యేకంగా వారికి నచ్చిన మోడల్స్ పంపుతారని, లేదంటే తామే వారికి నచ్చే విధంగా తయారుచేసి పంపుతామని తెలిపారు.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి