ఇదే అసలైన సవాల్ ? వారి పరిస్థితి ఏంటో ?

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.దాదాపు కర్ఫ్యూ వాతావరణం నెలకొనడంతో జనజీవనం అల్లాడుతోంది.

ముఖ్యంగా ఈ ప్రభావం సామాన్యుల మీద తీవ్రంగా పడింది.ఏపీ తెలంగాణలో 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో అత్యవసర సేవలు మినహా మారే ఇతర సర్వీసులు ప్రజలకు అందుబాటులో ఉండవు.

రవాణా కూడా స్తంభించింది.ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది.

ఈ విషయంలో తెలంగాణ, ఏపీ సీఎం ఇద్దరు కాస్త ముందస్తుగానే సామాన్య జనాల గురించి ఆలోచించినట్లు గా కనిపిస్తోంది.

తెలంగాణలో కరోనా ఎఫెక్ట్ కారణంగా ఒక నెల రేషన్ బియ్యంతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ 1500 రూపాయలను సరుకులు కొనుగోలు చేసేందుకు ఇస్తామని ప్రకటించారు.

ఇక ఏపీ సీఎం జగన్ ఉచితంగా అందరికీ రేషన్ బియ్యంతో పాటు కేజీ కంది పప్పు, మరో వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామంటూ ప్రకటించారు.

వచ్చే నెల 4వ తేదీన ఆ మొత్తాన్ని అందిస్తామన్నారు.లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది పడేది దినసరి కూలీలే.

వారి ఉపాధికి గండి పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.రెండు రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడంతో రైళ్లు, బస్సులు, క్యాబ్స్, ఆటోలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

కేవలం బియ్యం, పాలు, కూరగాయలు మాత్రమే సరఫరా చేస్తారు.ప్రజా రవాణా మొత్తం నిలిచిపోతుంది.

దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు.

ఏపీ లో అయితే చాలా కాలంగా సరైన పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

"""/"/ నిర్మాణ రంగం కుదేలవ్వడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా వారి ఉపాధిపైన తీవ్ర ప్రభావం పడుతోంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత నగదు, నిత్యావసర సరుకులు ఇవ్వడం వల్ల పేదలకు కాస్తలో కాస్త ఉపశమనం లభిస్తుంది.

కానీ ఇదే సమయంలో నిత్యావసర ధరలు కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది.

దీనిని సాకుగా చూపించి వ్యాపారులు బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించే అవకాశం కూడా లేకపోలేదు.

వీటన్నిటిని ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంటుంది.అంతేకాకుండా ఎటువంటి ఆదరణ లేని వారు, యాచకులు తదితరులంతా ప్రజల మీదే ఆధారపడి బతుకుతున్నారు.

వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.లేకపోతే కరోనా సంగతి ఎలా ఉన్నా, ఆకలి చావులు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు.

అందుకే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రతి విషయంపైన దృష్టి పెట్టి పరిస్థితులను చక్కదిద్దాలి.

ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలకు చోటు ఇవ్వకపోతే మంచిది.

బీజేపీ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’..: సీఎం రేవంత్ రెడ్డి