అమెరికాలో విద్యార్ధులకి కరోనా ముప్పు..!!!

అమెరికాలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టలేదు.రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.

ఎన్నో వ్యాపారా సంస్థలు సైతం మూతపడ్డాయి.దిక్కుతోచని స్థితిలో అమెరికా ప్రజలు కొట్టిమిట్టడుతున్నారు.

ఈ సమయంలో అమెరికా వ్యాప్తంగా స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఇదే జరిగితే స్కూళ్ళకి వెళ్ళే విద్యార్ధులు కరోనా బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అమెరికా వ్యాప్తంగా సుమారు 13,600 స్కూల్స్ ఉన్నాయి.అయితే స్కూళ్ళు ప్రారంభించాలా లేక యధావిధిగా ఆన్లైన్ లోనే పిల్లలకి పాటాలు చెప్పాలా అనే నిర్ణయం ఆయా స్కూల్స్ కి మాత్రమే ఉంటుంది.

అయితే దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న క్రమంలో ఆన్లైన్ స్కూల్స్ వైపే యాజమాన్యాలు మొగ్గుచూపుతున్నాయి.

ఎందుకంటె సరిగ్గా నెల రోజుల క్రితం ట్రంప్ ఒత్తిడి మేరకు స్కూల్స్ ప్రారంభించిన మొదటి రోజునే ఓ భారతీయ విద్యార్ధికి కరోనా పాజిటివ్ రావడమే కాకుండా అదే స్కూల్ లో సుమారు 100 మంది విద్యార్ధులకి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది.

దాంతో అమెరికా వ్యాప్తంగా స్కూల్ మూసివేసి ఆన్లైన్ లో క్లాసులు చెప్పడం ప్రారంభించారు.

ఈ చర్యల వలన సుమారు 10.37 లక్షల కేసులని నివారించగలిగారని ఓ అధ్యయనంలో తేలింది.

అయితే మళ్ళీ స్కూల్స్ ప్రారంభించడం యాజమాన్యాలకే ప్రభుత్వం వదిలేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ కూడా ఆన్లైన్ చదువులకే మొగ్గు చూపుతున్నాయట యాజమాన్యాలు.

దీని వలన ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా పిల్లలు అలవాటుపడుతారని అంటున్నారు నిపుణులు.

నాగార్జున కుబేర ఫస్ట్ లుక్ లో ఆ ఒక్కటి మిస్ అయింది…