ఏపీలో 5వేలు దాటినా కరోనా మరణాలు..!

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది.గతకొద్దీ రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి.

ఇక కేసులు పెరుగుతుండడంతో.కరోనా వైరస్ నుండి రికవరీ అయ్యేవారి సంఖ్య తగ్గుతుంది.

తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది.

అయితే ఏపీలో రికవరీ రేటు పెరుగుతుందని తెలిపారు.అయితే గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 8846 కరోనా కేసులు నమోదైయ్యాయి.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 69 మంది మృతి చెందినట్లు వెల్లడించారు.అంతేకాదు 9,628 మంది రికవరీ అయ్యినట్లు వెల్లడించారు.

అయితే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5 వేలు దాటినట్లు పేర్కొన్నారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925 కు చేరుకుంది.

అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 5,041 మందికి చేరింది.

ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారి నుండి 4,86,531 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 92,353 కరోనా కేసులు యాక్టివ్ లో ఉన్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్‌ లో వెల్లడించింది.

ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 10 మంది మృతి చెందారు.

చిత్తూరులో తొమ్మిది మంది, కడప, విశాఖపట్నంలో ఐదుగురు, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు, నెల్లూరు, విజయనగరం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందినట్లు నివేదికలో వెల్లడించారు.

ఇక గడిచిన 24గంటల్లో ఎక్కువగా తూర్పు గోదావరిలో 1423 కేసులు నమోదైయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపారు.

భార్య, కొడుకులు వేడుకున్నా ఎన్నారైపై దుండగులు కాల్పులు.. గన్ జామ్‌ కావడంతో?