సెకండ్ వేవ్‌ లోనూ దేవరకొండ టీమ్ సాయం

కరోనా సెకండ్‌ వేవ్ నేపథ్యంలో సినీ ప్రముఖులు మరియు జనాలు పెద్ద ఎత్తున ఎఫెక్ట్‌ అవుతున్నారు.

కరోనా మద్య తరగతి వారిని ఎక్కువగా ఇంపాక్ట్‌ చేస్తుందనే విషయం తెల్సిందే.ఈ సమయంలో కొందరు సినీ ప్రముఖులు తమకు తోచినంతగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

గత ఏడాది విజయ్ దేవరకొండ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రదేశాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు.

ముఖ్యంగా మద్య తరగతి వారికి వీరు చేసిన సహాయం నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం మళ్లీ విజయ్‌ దేవరకొండ టీమ్‌ సేవా కార్యక్రమాలు మొదలు పెట్టింది.విజయ్ దేవరకొండ మరియు ఆయన తమ్ముడు కలిసి మద్య తరగతి వారికి తమ వంతు సాయం అందించేందుకు గాను తమ టీమ్‌ ను రంగంలోకి దించారు.

తాజాగా విజయ్‌ దేవరకొండ ఏకంగా వంద కుటుంబాలకు సాయం అందించినట్లుగా తెలుస్తోంది.విజయ్‌ దేవరకొండ ఆన్ లైన్‌ ద్వారా వచ్చిన రిక్వెస్ట్‌ లకు వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

విజయ్‌ దేవరకొండ మరియు ఆయన సన్నిహితులు కలిసి వందల కుటుంబాలను ఆదుకుంటున్నారు.ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిస్కారం అన్నట్లుగా వీరి టీమ్ చేస్తున్న సేవ కార్యక్రమాలు చర్చనీయాంశంగా నిలిచాయి.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం లైగర్‌ సినిమా చేస్తున్నాడు.కరోనా కారణంగా షూటింగ్‌ ను వాయిదా వేశారు.

లైగర్‌ సినిమా కు పూరి జగన్నాద్‌ దర్శకత్వం వహించాడు.అనన్య పాండే హీరోయిన్ గా ఈ సినిమా లో నటిస్తోంది.

బాలీవుడ్‌ లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.తెలుగు మరియు ఇతర భాషల్లో పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు కరణ్‌ జోహార్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.

కరోనా కారణంగా ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా.. నెటిజన్ కు హీరోయిన్ షాకింగ్ కౌంటర్ వైరల్!