కరోనా చీరలు… ఎక్కడ అమ్ముతున్నారంటే!

కరోనా సమయంలో వ్యాపారాలు ఎంతగా దెబ్బ తిన్నాయో అందరికి తెలిసిందే.అయితే కొందరు తెలివైన వ్యాపారులు ఈ పదాన్ని ఉపయోగించే తమ పబ్బం గడుపుకుంటున్నారు.

ఆ మధ్య కరోనా బెడ్ అని,కరోనా పాపడ్ ఇలా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఎదో ఒకటి చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా కరోనా చీరలు వచ్చేశాయట.ఒకపక్క సరైన పోషక ఆహరం తినండి కరోనా ను జయించండి అంటూ వైద్యులు సూచిస్తుంటే మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్,హ్యాండి క్రాఫ్ట్ కార్పొరేషన్ మాత్రం మా చీరలు కట్టండి ఇమ్యూనిటీ పెంచుకొని కరోనా ను జయించండి అంటూ ఘంటాపధంగా చెబుతున్నారు.

ఇంతకీ చీర ద్వారా ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది అన్న అనుమానం వచ్చింది కదా.

అదే మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్,హ్యాండి క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆయుర్ వస్త్రా పేరుతొ ఈ చీరలను తయారు చేశాయి.

అయితే ఈ చీరలను వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలతో రూపొందించడం తో ఈ చీరల ద్వారా మహిళల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది అని వారు చెబుతున్నారు.

వంటకాల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు అయిన లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు, రాయల్ జీలకర్ర తదితర వస్తువుల ను ఈ చీరల తయారీలో ఉపయోగించామని, వాటన్నింటిని పొడిచేసి రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని మరిగించగా వచ్చిన ఆవిరిని చీరలకు పట్టించి ఇంత పెద్ద పద్దతి పాటించి మరి ఈ చీరలను తయారు చేస్తారు అంట.

ఈ పద్ధతిలో ఓ చీర రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అందిపుచ్చుకోవడానికి గరిష్టంగా 6 రోజుల వరకు పడుతుందని పేర్కొన్నారు.

అయితే ఈ చీరల ఖరీదు కనీసం రూ.3 వేలకు విక్రయించనున్నట్లు తెలుస్తుంది.

కరోనా కేసుల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సర్కార్ ప్రముఖ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ కు అప్పగించగా,వందల ఏళ్ల నాటి పద్దతి ను ఉపయోగించి ఈ చీరలను తయారు చేసినట్లు మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ తెలిపింది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..?: పోసాని