ఏపీలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా ఎన్ని కేసులంటే.. ?

ప్రస్తుత దశలో నమోదు అవుతున్న కరోనా కేసులను చూస్తుంటే ముందు ముందు ఏవైనా సంక్లిష్ట పరిస్దితులు తలెత్తితే ఎలాగనే భయం ఇప్పటికే కొందరిలో నమోదలైనట్లుగా సూచనలు కనిపిస్తున్నాయట.

ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వింజృంభన ఎంతకు తగ్గడం లేదట.ఇప్పటికే ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోందనే అందోళన కూడా మొదలైంది.

ఇకపోతే తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వివరాలను వెల్లడించింది.ప్రభుత్వ లెక్కల ప్రకారం.

గడచిన 24 గంటల్లో 35,196 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 758 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వెల్లడించింది.

అయితే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 175 కొత్త కేసులు నమోదవగా, గుంటూరు జిల్లాలో కూడా 127 మంది వరకు కరోనా బారినపడినట్లు అధికారులు తెలియచేశారు.

కాగా అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు బయటపడగా, 231 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించారు.

ఇక చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారట.

ఇలా మొత్తం మరణాల సంఖ్య 7,201కి చేరగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 8,95,879 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 3,469 యాక్టివ్ కేసులు ఉన్నాయిని ఆరోగ్యశాఖ పేర్కొంది.

పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే..: మంత్రి జోగి రమేశ్