దేశంలో కరోనా విజృంభణ.. 30 లక్షలకు పైగా !
TeluguStop.com
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదవుతునే ఉన్నాయి.
ఈ మేరకు దేశ వ్యాప్తంగా కరోనాను నిర్మూలించడానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుంది.రెండోదశ క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరింది.
ఈ మేరకు సెలెక్టెడ్ ఆస్పత్రుల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించారు.
క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత మార్కెట్ లో కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
అయితే కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా కేసులకు సంబంధించి హెల్త్ బులిటెన్ ను ఆదివారం విడుదల చేసింది.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 69,239 కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
కేసుల పెరుగుదలతో పాటు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.
ఇప్పటివరకూ 22,80,567 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.నిన్న ఒక్కరోజే దేశంలో 912 మంది కరోనా బారిన పడి చనిపోయారు.
దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 56,706 కు చేరింది.ప్రస్తుతం దేశంలో 7,07,668 యాక్టీక్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మీ సిమ్ యాక్టివ్ గా ఉంచాలంటే మినిమం రీచార్జ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే..