తెలంగాణలో కరోనా @ 2,381 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉంది.రోజూ రెండు వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కేసుల తీవ్రత అధికమవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో వైరస్ తీవ్రత ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు.

వైరస్ తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్ నగరంలో సిటీ సర్వీస్ బస్సులు కూడా ప్రారంభం అయ్యాయని, కరోనా నిబంధనలు పాటించకపోతే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,381 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటివరకూ మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,81,627కి చేరింది.నిన్న ఒక్కరోజే 2,021 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.

వీరి సంఖ్య 1,50,160కి చేరింది.ప్రస్తుతం రాష్ట్రంలో 30,387 యాక్టివ్ కేసులున్నాయని, వీరిలో 24,592 మంది హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 57,621 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు.దీంతో మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 27,41,836కి చేరిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.

రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు.హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 386, మేడ్చల్ మల్కాజిగిరిలో 193, రంగారెడ్డిలో 227, మహబూబ్ నగర్ లో 42, నల్గొండలో 132, కరీంనగర్ లో 119, భద్రాద్రి కొత్తగూడెంలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

వరుసగా నాలుగోసారి ఆ రికార్డును అందుకున్న బాలయ్య.. ఈ హీరో వేరే లెవెల్!