హెయిర్‌ను స్ట్రెయిట్ & స్మూత్‌గా మార్చే కార్న్‌ఫ్లోర్‌..ఎలాగంటే?

సాధార‌ణంగా అంద‌రి జుట్టూ ఒకేలా ఉండ‌దు.కొంద‌రిది క‌ర్లీ క‌ర్లీగా ఉంటే.

మ‌రికొందరిది మాత్రం స్ట్రెయిట్‌గా ఉంటుంది.ఏదేమైనా చాలా మంది స్ట్రెయిట్ హెయిర్‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు.

స్ట్రెయిట్ హెయిర్ అనేది అందాన్ని పెంచుతుంది.ఈ నేప‌థ్యంలోనే ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిటనర్లను యూజ్ చేసి జుట్టును స్ట్రెయిట్‌గా చేసుకుంటారు.

కానీ, ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల‌ జుట్టు ఆరోగ్యం దెబ్బ తిని నిర్జీవంగా మారి పోతుంది.

అంతే కాదు, జుట్టు రాలి పోవ‌డం.పొట్లి పోవ‌డం వంటి స‌మ‌స్య‌లూ స్టార్ట్ అవుతాయి.

అందుకే ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రెయిటనర్లతో కాకుండా న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనే జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నించాలి.

అయితే అందుకు కార్న్ ఫ్లోర్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అవును, కార్న్ ఫ్లోర్ హెయిర్‌ను స్ట్రెయిట్ అండ్‌ స్మూత్‌గా మార్చ‌గ‌ల‌దు.

మ‌రి కార్న్ ఫ్లోర్‌ను జుట్టుకు ఎలా ఉప‌యోగించాలి.? అన్న‌ది ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అర క‌ప్పు వాట‌ర్‌, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు హీట్ చేసుకుని.

చ‌ల్లార బెట్టు కోవాలి. """/"/ ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల అవిసె గింజ‌ల జెల్, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె లేదా బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత జుట్టు మెత్తానికి అప్లై చేసి గంట పాటు వ‌దిలేయాలి.త‌ద్వారా ఈ మిశ్రమం పూర్తిగా హెయిర్‌కి పడుతుంది.

గంట సేపు గడిచిన అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి.

ఇలా ఒక్క సారి చేస్తే చాలు మంచి ఫ‌లితం ఉంటుంది.

అనకాపల్లి కి 29న సీఎం రమేష్…