అధిక బ‌రువుకు ధనియాలతో చెక్.. ఎలాగంటే?

ఎంత వ‌ద్ద‌నుకున్నా పెరిగేది బ‌రువే.ఈ అధిక బరువు స‌మ‌స్య కార‌ణంగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు.

బ‌రువు పెర‌గ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, వ్యాయామాలు చేయ‌క‌పోవ‌డం, థైరాయిడ్ ఇలా చాలా కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరుగుతుంటారు.

ఇక బ‌రువు పెరిగిపోయాక‌.దాన్ని త‌గ్గించుకునేందుకు ఆపసోపాలు ప‌డుతుంటారు.

అయితే అధిక బరువును నియంత్రించ‌డంతో ధ‌నియాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌రువు త‌గ్గించుకోవాలి అనుకునే వారు.ముందుగా కొన్ని ధ‌నియాల‌ను మెత్తగా పోడి చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక స్పూన్ ధ‌నియాల పొడిని ఒక గ్లాస్ నీటిలో వేసి.బాగా మ‌రిగించాలి.

అనంత‌రం ఆ నీటిని వ‌డ‌గ‌ట్టుకుని.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత తీసుకోవాలి.

ఈ ధ‌నియాల నీటిని ప్ర‌తి రోజు ఉద‌యాన్నే తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది.

త‌ద్వారా అధిక బ‌రువుకు చెక్ పెట్ట‌వ‌చ్చు.అలాగే ధ‌నియాల‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

ధ‌నియాల‌ను ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ఇక ఇటీవ‌ల కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు.ఎంత ప‌డుకుందామ‌నుకున్నా.

నిద్ర ప‌ట్ట‌నే ప‌ట్ట‌దు.అలాంటి వారు ధ‌నియాల‌తో త‌యారు చేసిన క‌షాయాన్ని తీసుకుంటే.

నిద్ర లేమి స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.ధ‌నియాల‌ను ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవ‌డం వ‌ల్ల‌.

ఇందులో విట‌మిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇక జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ధ‌నియాలు వేసి మ‌రిగించిన నీటిని తీసుకుంటే మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే ధ‌నియాల‌ను ప్ర‌తి రోజు వాడ‌డం వ‌ల్ల గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

మ‌రియు షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

బెంగుళూర్ టీమ్ ఈసారి కప్పు గెలిచే అవకాశం ఉందటరా..?