మొటిమలు.తరచూ ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
ముఖం ఎంత అందంగా, తెల్లగా ఉన్నా.మొటిమలు ఏర్పడ్డాయంటే అందహీనంతగా మారిపోతుంటారు.
ఈ క్రమంలోనే మొటిమలను నివారించుకునేందుకు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.కొందరైతే మొటిమలను తగ్గించుకుంనేందుకు ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు.
అయితే ట్రీట్మెంట్లు, కెమికల్స్‌తో నిండి ఉండే క్రీములు చర్మానికి ఏ మాత్రం మంచివి కావు.
అందుకే న్యాచురల్‌గానే మొటిమలను నివారించుకోవాలని నిపుణులు చెబుతుంటారు.అయితే ఎటువంటి మొండి మొటిమలనైనా నివారించడంలో ధనియాలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
ఆరోగ్య పరంగా ధనియాలు ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే అందరికీ తెలుసు.
కానీ, చర్మానికి కూడా ధనియాలు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా మొటిమల సమస్యతో ఇబ్బంది పడే వారు ధనియాలను పొడి చేసి.
అందులో చిటికెడు పసుపు మరియు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.
ఇరవై నిమిషాల పాటు ఆర నివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే.క్రమంగా మొటిమలు తగ్గుముఖం పడతాయి.
మరియు మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు కూడా మటుమాయం అవుతాయి.అలాగే ధనియాలను పొడి చేసుకుని పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ నిమ్మ రసం, అర స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలు ఏర్పడిన ప్రాంతంలో అప్లై చేయాలి.పావు గంట లేదా అర గంట పాటు అలా వదిలేసి.
అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తూ ఉంటే.