ఒళ్లు నొప్పులు.ఎప్పుడోకప్పుడు, ఏదో ఒక సమయంలో అందరూ ఫేస్ చేసిన కామన్ సమస్యే ఇది.
భారానికి మించి పని చేయడం, ఆహారపు అలవాట్లు, ఒకే చోట ఎక్కువ సమయం పాటు కదలకుండా కూర్చోవడం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల ఒళ్లు నొప్పులు వేధిస్తుంటాయి.
దాంతో వెంటనే చాలా మంది చేసే పని పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం.కానీ, ప్రతీసారి పెయిన్ కిల్లర్‌లు వేసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
అందుకే.ఇంటి చిట్కాల ద్వారా ఒళ్లు నొప్పులను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
"""/" /
అయితే అందరి వంటింట్లో ఉండే ధనియాలు ఒళ్లు నొప్పులను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
ధనియాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్, కాల్షియం, మెగ్నీషయం, జింక్, ఇనుము, ఫాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
అందుకే ధనియాలు అనేక జబ్బులను తరిమి కొట్టడంలో గ్రేట్‌గా ఉపయోగపడతాయి.అలాగే ఒళ్లు నొప్పులకు కూడా ధనియాలు ఒక పెయిన్ కిల్లర్‌లా పని చేస్తాయి.
మరి ఇంతకీ ధనియాలను ఎలా తీసుకోవాలంటే.ముందు వీటిని పొడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లో ధనియాల పొడి వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి.
ఆ తర్వాత అందులో కావాలి అని అనుకుంటే తేనె మరియు నిమ్మ రసం కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే ఒళ్లు నొప్పుల నుంచి త్వరగా రిలీఫ్ పొంద వచ్చు. """/" /
ఇక ఈ ధనియల వాటర్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది.
అలాగే ధనియల వాటర్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.ఫలితంగా.
వైరస్ లు మరియు ఇతరితర జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
అప్పుడు రజనీకాంత్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్… జపాన్ లో ఆ ఘనత వీళ్లకే సొంతమా?