కొత్తిమీర రసంలో ఇవి కలిపి రాస్తే.. మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే!
TeluguStop.com
కూరల్లో విరివిరిగా ఉపయోగించే కొత్తిమీర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా నాన్‌వెజ్ ఐటెమ్స్‌లో కొత్తిమీర లేకపోతే.
ఏదో వెలితిగా ఉన్నట్టే అనిపిస్తుంది.చక్కని రుచి, సువాసన అందించే కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అదే సమయంలో అందాన్ని రెట్టింపు చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.అందులోనూ కొత్తిమీర రసంలో ఇప్పుడు చెప్పబోయే పదార్థాలు కలిపి ముఖానికి రాస్తే.
చర్మం మెరవడం ఖాయం.మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగో కొత్తిమీర రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
ఓ పావు గంట పాటు ఆరనిచ్చి.అనంతరం నీటిలో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మొండి మచ్చలు తొలగుతాయి.కొత్తిమీర రసంలో కొద్దిగా టొమాటోగుజ్జు కలిపి ముఖానికి అప్లే చేయాలి.
అర గంట పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సయస్య తగ్గడంతో పాటు ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.
అలాగే కొత్తిమీర రసంలో కొద్దిగా కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి.
బాగా ఆరిన తర్వాత.గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం కొత్తిమీరలోని విటమిన్ ఎ చర్మాన్ని తేమగా మారేలా చేస్తుంది.ముడతలను పొగొడుతుంది.
అదే సమయంలో ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది.
ఈ స్టార్ డైరెక్టర్లు ఇప్పటికైన మారాల్సిన అవసరం ఉందా..?