కాపీల “విశ్వంభర”.. హీరో గెటప్ టూ వరస్ట్..?

మల్లిడి వశిష్ఠ( Mallidi Vassishta ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న "విశ్వంభర" సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

ఇందులో త్రిష, మీనాక్షి చౌదరి, ఆశికా రంగానాథ్ లాంటి క్యూట్ బ్యూటీస్ నటిస్తున్నారు.

ఈ సినిమా ఫాంటసీ, యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రానుంది.ఈ మూవీ టీజర్ ని నిన్ననే రిలీజ్ చేశారు.

అయితే ఇందులో హాలీవుడ్ సినిమాల నుంచి చాలా క్రియేటివ్ కంటెంట్స్‌ని కాపీ చేసినట్లుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

డ్యూన్ సినిమా మ్యూజిక్, అవెంజర్ ఇన్ఫినిటీ వార్ టైలర్ షాట్‌, అవతార్ డ్రాగన్స్, జురాసిక్ వరల్డ్ డైనోసార్లు, ఇలా చాలా క్రియేటివ్ ఎలిమెంట్స్ కాపీ కొట్టేసి ఈ టీజర్ క్రియేట్ చేసినట్లుగా కనిపిస్తోందని చాలామంది ట్రోల్ చేస్తున్నారు.

ఈ టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ కూడా వరస్ట్ గా ఉందని తిట్టిపోస్తున్నారు.

అయితే ఈ విమర్శలు చేసే వారందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ అని, మెగాస్టార్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చిరు అభిమానులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

సాహో, బాహుబలి సినిమాల గ్రాఫిక్స్ గురించి ఇలాంటి ట్రోల్స్ రాలేదని, విశ్వంభర సినిమాని కావాలని టార్గెట్ చేస్తున్నారని వారు అసంతృప్తి కూడా కనబరిస్తున్నారు.

మెగా అభిమానులు యాంటీ ఫ్యాన్స్ పై ఎంత విరుచుకుపడుతున్నా వారు మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఆ సినిమాని ఏకిపారేస్తూనే ఉన్నారు.

కొందరైతే విశ్వంభర ఆదిపురుష్‌ కంటే దరిద్రంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.మల్లిడి వశిష్ఠ మరో ఓం రౌత్‌ అని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్ గా ఉందని అంటున్నారు.

"""/" / విశ్వంభర సినిమా( Vishwambhara )కి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.ఆస్కార్ అవార్డు విన్నరాయన.

అయినా సరే విశ్వంభర బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగోలేదని అంటున్నారు.ఆయన రాజమౌళి సినిమాలకి మాత్రమే మ్యూజిక్ సొంతంగా కంపోజ్ చేస్తాడట.

మిగతా సినిమాల మ్యూజిక్ తన అసిస్టెంట్లే వాయిస్తారట.ఈ ఆరోపణలు చేస్తూ విశ్వంభర మ్యూజిక్ కాపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి కొంతమంది చెబుతున్నట్లు విశ్వంభర గ్రాఫిక్స్( Graphics ) అంత వరస్ట్ గా ఏమీ లేదు.

చూసేందుకు బాగానే ఉంది కానీ దర్శకుడు తన సొంత ఆలోచనలు వాడకుండా హాలీవుడ్ క్రియేటివ్ కంటెంట్ తీసుకొని ఈ సినిమాలో వాడేసినట్టుగా తెలుస్తోంది.

అయితే ఇందులో చిరంజీవి మామూలు మాస్‌ సినిమాలోలాగా సాదాసీదా లుక్ తో కనిపించాడు.

అదే చాలామందికి నచ్చడం లేదు. """/" / దర్శకుడు ఈ సినిమా కోసం లోకం పుట్టుక, అలుముకుంటున్న చీకట్లు, విశ్వానికే ప్రమాదం అంటూ ఓ అద్భుతమైన ఫాంటసీ సబ్జెక్టు తీసుకున్నాడు.

ఇందులో దుష్టశక్తులు గ్రహాంతరవాసుల్లా కనిపించాయి.అలానే చిరంజీవి ఒక రెక్కల గుర్రంపై ఎక్కి వచ్చాడు.

చూసేందుకు అది ఒక వేరే లోకం లాగా కనిపించింది కానీ విశ్వాన్ని రక్షించే చిరంజీవి మాత్రం మునుపటి మాస్‌ సినిమాల్లో ఎలా కనిపించాడో అలానే కనిపించాడు.

ఆ సేమ్ గెటప్ ఈ సినిమాకి అసలు సూట్ కాలేదని చెప్పుకోవచ్చు.విశ్వరక్షకులు, విశ్వంభరలు క్యారెక్టర్లు చేయడానికి చిరంజీవి ఒప్పుకోవడమే ఒక సాహసం.

అందులో కూడా మామూలు యాక్షన్ సినిమాలో లాగా ఫైట్లు చేయడం విడ్డూరంగా అనిపించింది.

అరెస్టుకు ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన కస్తూరి.. నేనేం పారిపోలేదంటూ?