ఆదిపురుష్ పరువు తీసిన యానిమేషన్ స్టూడియో.. మా పోస్టర్ కు కాపీ అంటూ?

ఆదిపురుష్ మూవీ టీజర్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన నిమిషం నుంచి ఈ సినిమా గురించి జరుగుతున్న ట్రోలింగ్ అంతాఇంతా కాదు.అయితే తాజాగా ప్రముఖ యానిమేషన్ స్టూడియో ఆదిపురుష్ మూవీ పరువు తీసేసింది.

ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శల నేపథ్యంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తాజాగా వానర్ సేన్ స్టూడియో ఆదిపురుష్ మేకర్స్ తమ వర్క్ ను కాపీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.

తాము రూపొందించిన శివుడి పోస్టర్ ను ఆధారంగా చేసుకుని ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారని ఈ సంస్థ పేర్కొంది.ఇప్పటికే పలు వివాదాలలో చిక్కుకున్న ఆదిపురుష్ చిత్రయూనిట్ కు ఈ ఆరోపణలు తలనొప్పిగా మారతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

< -->ఒరిజినల్ క్రియేటర్ కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ వానర్ సేన్ స్టూడియో కామెంట్లు చేయగా సదరు సంస్థ ఆరోపణలు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

దర్శకుడు ఓం రౌత్ పై సెలబ్రిటీలు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా వివాదాలలో చిక్కుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

< -->టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.

ఆదిపురుష్ సినిమా విషయంలో వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్లకు సంబంధించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.నెగిటివ్ ట్రోల్స్ నేపథ్యంలో ఈ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది.

క్లిక్ పూర్తిగా చదవండి

తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ అమలుకు శ్రీకారం..!

ఇంటర్నేషనల్ విమానాల్లో ఆల్కహాల్ ఎందుకు సర్వ్ చేస్తారో తెలుసా?

చిరంజీవి పరువు తీసిన గాడ్ ఫాదర్ రేటింగ్.. ఆ సినిమాల కంటే తక్కువంటూ?

గూగుల్‌లో ఉద్యోగం చేస్తున్న భార్యాభ‌ర్త‌లు… హ‌ఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోవ‌డంతో…

సోమాలియాలో అమెరికా దాడులు.. ఐఎస్ఐఎస్ సీనియర్ లీడర్ మృతి..