బైకర్ల కోసం సరికొత్త హెల్మెట్.. వేసవిలో చల్లచల్లగా!

దేశంలోని వాతావరణం చాలా మార్పులకు గురవుతోంది.వేసవితో సంబంధం లేకుండానే భానుడు భగ్గుమంటున్నారు.

నేడు వర్షాకాలం అయినప్పటికీ ఎండలు చాలా తీవ్రంగా మండిపోతున్నాయి.ఇక ఎండాకాలంలో అయితే పరిస్థితి వేరే చెప్పాల్సినపనిలేదు.

అందువలన ఇక్కడ ఎక్కువగా వాహనదారులు బాగా ఇబ్బందులకు గురవుతారు.ముఖ్యంగా హెల్మెట్‌ పెట్టుకుని బండినడిపే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

పై నుంచి ఎండవేడి, హెల్మెట్‌ ఉష్ణోగ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ వుంటారు.హెల్మెట్ లోపల కుషన్ కారణంగా హెల్మెట్‌ ఎక్కువ వేడేక్కటంతో బైక్‌ రైడర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటారు.

ఈ క్రమంలోనే కూలింగ్ హెల్మెట్ అనేది రూపుదిద్దుకుంది.ఇది వేసవిలో రైడింగ్ చేసేటప్పుడు మీకు ఉపశమనం ఇస్తుంది.

ఇది చాలా శక్తివంతమైనది.ఇక్కడ కూలింగ్ యంత్రం హెల్మెట్‌ను చల్లబరుస్తుంది.

ఈ హెల్మెట్‌ ధరించి బైక్‌ డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం కూడా వేడిలో ప్రయాణించినట్లు అనిపించదు.

ఈ సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నిజంగా దీన్ని వాడి చూసినవారు చాలా పాజిటివ్ గా రివ్యూలు ఇస్తున్నారు.

ప్రస్తుతం హెల్మెట్ కూలింగ్ పరికరాలను తయారు చేసే అనేక కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి.

"""/" /వీటిలో బ్లూ ఆర్మర్ అనే కంపెనీ ఒకటి.ఈ కంపెనీయే ఈ పరికరాన్ని తయారు చేస్తుంది.

దీని ధర రూ.1,999, రూ.

2,299 నుండి రూ.4,999 వరకు వుంది.

ఈ పరికరం బ్యాటరీతో పనిచేస్తుంది.ఇందులో చిన్న ఫ్యాన్‌ని అమర్చబడి ఉంటుంది.

దీనితో పాటు, ఇందులో మినీ మోటార్‌ కూడా అమర్చబడి ఉంటుంది.ఇది ఫ్యాన్‌ తిరిగేలా పనిచేస్తుంది.

ఈ ఫ్యాన్‌లో బలమైన ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది.ఇది తేమను సమతుల్యం చేస్తుంది.

అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తుంది.దాంతో మీరు మండే ఎండలో కూడా హెల్మెట్‌ పెట్టుకుని హాయిగా కూలింగ్ అవ్వొచ్చు.

గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ దశ మారనుందా..?