సివిల్స్ లో సత్తా చాటిన వంటమనిషి కొడుకు.. తండ్రి లేకపోయినా ఫలితాల్లో విజేతగా నిలవడంతో?
TeluguStop.com
సివిల్స్ ఫలితాల్లో( UPSC Civils ) సత్తా చాటడం దేశంలో ఎంతోమంది యువతీ యువకుల కల అనే సంగతి తెలిసిందే.
కొంతమంది ఆ కలను సులువుగానే నెరవేర్చుకుంటే మరి కొందరు ఆ కలను నెరవేర్చుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అయితే కనీస సౌకర్యాలు లేకపోయినా కష్టపడి మంచి ర్యాంకులు సాధిస్తున్న వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.
తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో వంటమనిషి కొడుకు సత్తా చాటారు.తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీమ్( Kumram Bheem ) జిల్లాకు చెందిన పేదింటి బిడ్డ అయిన డోంగ్రి రేవయ్య( Dongre Revaiah ) సివిల్స్ లో 410 ర్యాంకును సాధించడం గమనార్హం.
కెరీర్ విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రేవయ్య యూపీఎస్సీలో విజేతగా నిలిచి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.
రేవయ్య తల్లి ప్రభుత్వ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు.చిన్నతనంలోనే రేవయ్య తండ్రిని కోల్పోయాడు.
"""/" /
తల్లి విస్తారుబాయి ఒకవైపు కూలి పనులు చేస్తూ మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తూ ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించారు.
ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన రేవయ్య ఓఎన్జీసీలో ఐదు సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేశారు.
ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి సివిల్స్ తో సత్తా చాటారు.గతేడాది రెండు మార్కుల తేడాతో అవకాశం కోల్పోయిన రేవయ్య ఈ ఏడాది మాత్రం మంచి ఫలితాలను సొంతం చేసుకున్నారు.
"""/" /
సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించడం గురించి రేవయ్య మాట్లాడుతూ మమ్మల్ని చదివించడానికి మా అమ్మ పడిన కష్టం మాటల్లో చెప్పలేనని అన్నారు.
నాకు ఐఐటీలో సీటు వచ్చిన సమయంలో నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని ఆయన తెలిపారు.
కొంతమంది దాతల సహకారంతో నేను చదువుకున్నానని రేవయ్య చెప్పుకొచ్చారు.వాళ్ల మేలు మరిచిపోనని నాలాంటి పేదలకు సేవలందించడమే లక్ష్యం అని రేవయ్య కామెంట్లు చేశారు.
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ .. వీటిపైనే కీలక నిర్ణయాలు