వైఎస్ఆర్ వ్యూపాయింట్ పేరుపై వివాదం

విశాఖ బీచ్ అందాన్ని చూపించే వ్యూపాయింట్ పై వివాదం కొనసాగుతుంది.సీతకొండకు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరు పెట్టడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

వైఎస్ఆర్ పేరు తీర్చేసి సీతకొండ వ్యూ పాయింట్ గా పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో బీజేపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.

ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తండ్రి వెల్డింగ్ షాప్ లో ఉద్యోగి.. కూతురు టెట్ టాపర్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!